నాకు ప్రాణహాని ఉంది..: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రవి శంకర్ కీలక వ్యాఖ్యలు

By Sumanth Kanukula  |  First Published Nov 20, 2023, 5:21 PM IST

చొప్పదండి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశార. కాంగ్రెస్ నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు.


చొప్పదండి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశార. కాంగ్రెస్ నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ గూండాల నుంచి రక్షణ కల్పించాలని కోరారు. వివరాలు.. ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గం పరిధిలోని బోయినపల్లి మండలంలో సుంకే రవిశంకర్ ప్రచారం నిర్వహించారు. అయితే ఈ సందర్భంగా మిడ్ మానేరు నిర్వాసితులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఆయననుఅడ్డుకునేందుకు ప్రయత్నించారు. బీఆర్ఎస్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మిడ్ మానేరు నిర్వాసితులు ఆరోపించారు. హామీలు నెరవేర్చుకుండా మళ్లీ ఎలా ఓట్లు అడుగుతున్నారని రవిశంకర్‌ను ప్రశ్నించారు. 

ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. అయితే ఓ వ్యక్తి రవి శంకర్‌కి చెప్పు చూపించారు. ఈ క్రమంలోనే అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి రవిశంకర్ స్పందిస్తూ.. తనకు ప్రాణహాని ఉందన్నారు. కాంగ్రెస్ గూండాల నుంచి రక్షణ కల్పించాలన్నారు. తనను చంపాలని చూస్తున్నారని ఆరోపించారు. తనకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు వీడియోలు తీస్తున్నారని రవి శంకర్ పేర్కొన్నారు.

Latest Videos

ప్రశాంతంగా ఉన్న చొప్పదండిని గుండాల చేతుల్లోకి తీసుకెళ్తున్నారని రవి శంకర్ ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీకి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేశారు. 
 

click me!