హైద్రాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ లో ఆదివారం నాడు రూ. 2.5 కోట్ల నగదును టాస్క్ ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. హవాలా రూపంలో ఈ నగదును తరలిస్తున్నారని సమాచారం.
హైదరాబాద్:నగరంలోని జూబ్లీహిల్స్ లో ఆదివారం నాడు రూ. 2.5కోట్ల నగదును టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదును తరలిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హవాలా రూపంలో ఈ నగదును తరలిస్తున్నారని కచ్చితమైన సమాచారం అందడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుండి నగదును సీజ్ చేశారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.
రెండు రోజుల వ్యవధిలో హైద్రాబాద్ లో రూ. 4కోట్ల విలువైన నగదును పోలీసులు సీజ్ చేశారు. శనివారం నాడు రాత్రి హైద్రాబాద్ పాతబస్తీలో రూ. 79 లక్షలు, శుక్రవారం నాడు సాయంత్రం జూబ్లీహిల్స్ లో రూ. 50 లక్షలను హవాలా రూపంలో తరలిస్తున్న సమయంలో పోలీసులు సీజ్ చేశారు.
undefined
గతంలో కూడ హైద్రాబాద్ లో హవాలా రూపంలో నగదును తరలిస్తు పట్టుబడిన ఘటనలున్నాయి. రూ.3.75 కోట్ల నగదును హైద్రాబాద్ పోలీసులు 2020 సెప్టెంబర్ 15న సీజ్ చేశారు. నలగురు వ్యక్తులను పోలీసులు ఆ సమయంలో అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న నగదును పోలీసులు ఐటీ శాఖకు అప్పగించారు.
2020 అక్టోబర్ 31న హైద్రాబాద్ టాస్క్ పోర్స్ పోలీసులు రూ. 30 లక్షల నగదును సీజ్ చేశారు ఇద్దరిని అరెస్ట్ చేశారు. హైద్రాబాద్ గౌలిగూడకు చెందిన వ్యక్తితో పాటు రాజస్థాన్ కు చెందిన మరొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. రవాణా వ్యాపారం పేరుతో హవాలా రూపంలో డబ్బును తరలిస్తున్నారనే సమచారం ఆధారంగా పోలీసులు దాడి చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ కు చెందిన షోయబ్ మాలిక్ కు చెందిన రూ. 1.24 కోట్లను హైద్రాబాద్ పోలీసులు వారం రోజుల క్రితం సీజ్ చేశారు. మాలిక్ హైద్రాబాద్ లో పాత ఇనుము వ్యాపారం చేస్తున్నాడు. హవాలా రూపంలో ఆయన డబ్బును తరలిస్తున్నాడని పోలీసులు గుర్తించారు.