నిజామాబాద్ లో పశువులకు సోకిన వింత వ్యాధి: ల్యాబ్ కు బ్లడ్ శాంపిల్స్

By narsimha lode  |  First Published Oct 9, 2022, 2:03 PM IST

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పశువులకు వింత వ్యాధి సోకింది. దీంతో పశువులు మృత్యువాత పడ్డాయి. ఈ ప్రాంతంలోని పశువుల రక్తనమూనాలను తీసి ల్యాబ్ కు పంపారు. 


నిజామాబాద్ :ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పశువులకు వింత వ్యాధిసోకింది. దీంతో పశువులు మృత్యువాత పడుతున్నాయి..మరణించిన పశువులతో పాటు వ్యాధి బారిన పడి పశువుల నుండి రక్త నమూనాలను సేకరించారు. రక్త నమూనాలను ల్యాబ్ కు పంపారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని  ఎల్లారెడ్డిలో లేగదూడ మృతి చెందింది.  నవీపేట, నందిపేట, బాన్సువాడల్లో పశువులకు వ్యాధి సోకింది.  దేశంలోని పలు ప్రాంతాల్లో లంపీ వైరస్ పశువులకు సోకుతుంది. ఈ వైరస్ సోకిందా అనే అనుమానంతో పవుసంవర్ధక శాఖ అధికారులు పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Latest Videos

లంపీ వైరస్ వ్యాప్తి చెందకుండా పశు  సంవర్ధక శాక అధికారులు చర్యలు చేపట్టారు. రాష్ట్రంలోని26 జిల్లాలోని 3 వేల పశువులను  ఈ వైరస్ ప్రభావిం చేసిందని అధికారులు చెబుతున్నారు. అయినా కూడా పరిస్థితి అదుపులోనే ఉందని వారు చెప్పారు.   ఈ  వైరస్ వ్యాప్తి చెందిన పశువులు ఉన్న ఐదు కిలోమీటర్ల పరిధిలోని జంతువులుకు  లంపీ వైరస్ వ్యాప్తి చెందకుండా వ్యాక్సిన్  అందిస్తున్నారు. లంపీ వైరస్ కారణంగా దేశంలో సుమారు 80 వేల పశువులు మృతి చెందాయి. అయితే  తెలంగాణలో మాత్రం మూడు పశువులు  మాత్రమే చనిపోయినట్టుగా అధికారులు ప్రకటించారు. 

2020 లో ఈ వ్యాధి సోకిన పశువులు రెండోసారి వ్యాధి బారిన పడకుండా వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటాయని పశు సంవర్ధక శాఖాధికారులు చెబుతున్నారు.  రాష్ట్రంలోని 2967 పశువులు  కాప్రిపాక్స్ వైరస్ బారిన పడ్డాయన్నారు.  అయితే ఇందులో 2,200 పశువులు కోలుకున్నాయని  అధికారులు తెలిపారు.  రాష్ట్రంలోని84 లక్షల  పశువుల్లో 2, 61, 672  పశువులకు టీకాలు వేసినట్టుగా అధికారులు తెలిపారు. 
 

click me!