నిజామాబాద్ లో రౌడీ మూకల వీరంగం.. రాళ్లు, కర్రలతో దాడిచేసి టీస్టాల్ ను తుక్కు తక్కు చేసి...

Published : Feb 16, 2022, 12:42 PM IST
నిజామాబాద్ లో రౌడీ మూకల వీరంగం.. రాళ్లు, కర్రలతో దాడిచేసి టీస్టాల్ ను తుక్కు తక్కు చేసి...

సారాంశం

టీ తాగుతుండగా చెలరేగిన వివాదం.. చివరికి ఆ టీ స్టాల్ యజమానికి తీరని నష్టాన్ని మిగిల్చింది. నిజామాబాద్ లో రౌడీషీటర్ల గ్యాంగ్ వార్ లో ఓ టీస్టాల్ నుజ్జునుజ్జయ్యింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.. 

నిజామాబాద్ : Nizamabad జిల్లాలో Rowdy మూకలు రెచ్చిపోయారు. ఆటో నగర్ లోని రజాక్ టీ స్టాల్ మీద పై పెద్ద పెద్ద రాళ్లు, కర్రలతో 
Rowdy sheeter, అనుచరులు దాడులకు తెగబడ్డారు.హోటల్లో టీ తాగుతుండగా వివాదం తలెత్తడంతో రౌడీషీటర్, PD Act నిందితుడు Jungle Hibbతో పాటు అతని అనుచరులు దాడి చేశారు. ఒకసారిగా ఐదుగురు రౌడీలు రజాక్ హోటల్ పై ఇనుపరాడ్లతో వీరంగం సృష్టించారు. టీ షాప్ లో ఉన్న వారిపై రాళ్లతో దాడి చేసి, హోటల్లోని ఫర్నీచర్ను ధ్వంసం చేశారు.

ఈ ఘటనలో రౌడీషీటర్ జంగిల్ హిబ్బు సహా ఐదుగురిపై కేసు నమోదు చేశారు. రౌడీ మూకల వీరంగంపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా రౌడీషీటర్ల దాడిలో గాయపడిన బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు టీ స్టాల్ లోని వ్యక్తిని రోడ్డుపైకి లాక్కొచ్చి కిరాతకంగా దాడి చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇదిలా ఉండగా, హైదరాబాద్ లో రహస్యంగా Poker స్థావరాలు నిర్వహిస్తున్న రెండు వర్గాల మధ్య ఆదివారం అర్థరాత్రి gangwar జరిగింది. కళ్లల్లో కారంపొడి చల్లుకుని కర్రలు, రాడ్లతో ఇరువర్గాలు ఘర్షణకు దిగారు. సినిమా ఫక్కీలో జరిగిన Pate Bashirabad పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. స్నేహితుడి డబ్బు వసూలు విషయంలో కలుగ చేసుకున్న యువకుడు ప్రత్యర్థులతో గొడవకు దిగి.. తీవ్రగాయాలతో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. కాగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ గొడవకి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి…

షాపూర్ నగర్ ప్రాంతానికి చెందిన చేపల రాము, జీడిమెట్ల రామిరెడ్డి నగర్ కు చెందిన మణికంఠ కొంతకాలంగా నగర శివార్లలో వేర్వేరుగా పేకాట క్లబ్ లను నిర్వహిస్తున్నారు. కొంత కాలంగా వీరి మధ్య అంతర్గత పోరు నడుస్తోంది. ఇదిలా ఉండగా..  గతంలో తన వద్ద పనిచేసిన రమేష్ కు రాము కొంత డబ్బు బాకీ పడినట్లు తెలిసింది.  ఆ డబ్బు వసూలు విషయంలో రాముకు, రమేష్ కు గొడవ జరిగింది. దాంతో తన డబ్బులు ఎలాగైనా వసూలు చేసుకోవాలని భావించిన రమేష్ ఈ విషయాన్ని తన స్నేహితుడు మణికంఠకు చెప్పాడు. దీంతో మణికంఠ ఫోన్ చేసి తన స్నేహితుడికి ఇవ్వాల్సిన డబ్బులు వెంటనే ఇచ్చేయాలని రాము హెచ్చరించాడు.

ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. డీపీఆర్ స్కూల్ వద్దకు రావాలంటూ మణికంఠకు రాము సవాల్ విసిరాడు. మణికంఠ తన అనుచరులతో స్కూల్ వద్దకు వెళ్ళగా.. అప్పటికే దాదాపు 20 మందితో కాపు కాచి ఉన్న రాము.. ఒక్కసారిగా వారిపై విరుచుకు పడ్డారు. కళ్లల్లో కారం చల్లి, కర్రలు, రాడ్లు వంటి మారణాయుధాలతో దాడికి పాల్పడ్డాడు. మణికంఠ గ్యాంగ్ కూడా వారిపై ఎదురు దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన మణికంఠ రక్తపు మడుగులో పడి పోయాడు.  

మరో వ్యక్తి శ్రీహరి రాజు తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇరువర్గాల మధ్య జరుగుతున్న గ్యాంగ్ వార్ ను గుర్తించిన స్థానికులు.. పోలీసులకు 108 సిబ్బందికి ఫోన్ చేశారు. క్షతగాత్రులను హుటాహుటిన సూరారం లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మణికంట పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ కుండపోత వర్షాలు, వరదలు... ఇక్కడ కూడా వానలు షురూ..!
Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!