
హైదరాబాద్: బ్యాంకులో ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారంతో Iఐఐఎఫ్‌ఎల్ బ్యాంకు మేనేజర్ రాజ్ కుమార్ క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడ్డాడు. ఈ విషఁయాన్ని గుర్తించిన బ్యాంకు యాజమాన్యం Raj kumar పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
హైద్రాబాద్ IIFLలో పలువురు ఖాతాదారులు Gold తాకట్టు పెట్టి Loans తీసుకొన్నారు. అయితే బ్యాంకులో సుమారు 14.5 కలోల బంగారాన్ని బ్యాంకు మేనేజర్ రాజ్ కుమార్ బ్యాంకు నుండి మాయం చేశారు. ఈ బంగారంతో క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడ్డాడు. వన్ స్టార్ బెట్ యాప్ లో రాజ్ కుమార్ Cricket Betting లకు పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన బ్యాంకు యాజమాన్యం వెంటనే పోలీసులకు పిర్యాదు చేసింది. పోలీసులు బ్యాంకు మేనేజర్ రాజ్ కుమార్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.