
హైదరాబాద్: Assam CM హిమంత బిశ్వ శర్మపై కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదులన్నీ Hyderabad జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు బదిలీ అవుతాయని హైద్రాబాద్ సీపీ CV Anand చెప్పారు.Congress పార్టీ మాజీ చీఫ్, ఎంపీ Rahul Gandhi పై అసోం సీఎం Himanta Biswa Sarma చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్రంలోని 703 పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. హైద్రాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇదే విషయమై ఫిర్యాదు చేశారు. అసోం సీఎంపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్టుగా హైద్రాబాద్ సీపీ సీవీ ఆనంద్ ప్రకటించారు. జూబ్లీహిల్స్ పోలీసులే ఈ కేసును దర్యాప్తు చేస్తారని ఆయన వివరించారు.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ప్రతి పోలీస్ స్టేషన్లలో GD ఎంట్రీ చేసుకొని ఈ ఫిర్యాదులను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు పంపుతామని సీపీ సీవీ ఆనంద్ చెప్పారు.
Uttarakhand Assembly Election 2022 ప్రచారంలో భాగంగా అసోం సీఎం ఈ నెల 11వ తేదీన రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. 2016లో Pakistan పై జరిగిన Surgical Strike కు సంబంధించిన ఆధారాలను బయట పెట్టాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.ఈ విషయమై హిమంత బిశ్వశర్మ స్నందించారు. రాహుల్ గాంధీ మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ తనయుడే అని చెప్పడానికి ఆధారాలు అడగలేదు కదా అని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేగాయి. ఈ వ్యాఖ్యలను పలువురు ఖండించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఈ వ్యాఖ్యలను ఖండించారు.
అసోం సీఎంHimanta Biswa Sarma వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు ఇచ్చారు. మోతీలాల్ నెహ్రు, జవహర్ లాల్ నెహ్రు, ఇందిరా గాంధీలు దేశం కోసం సేవ చేశారని ఈ ఫిర్యాదులో కాంగ్రెస్ నేతలు గుర్తు చేశారు. 1990 అక్టోబర్ 19న రాజీవ్ గాంధీ హైద్రాబాద్ లో సద్భావన యాత్రను నిర్వహించారని కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఐపీసీ 153 ఏ, 505(2), 294 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని కాంగ్రెస్ నేతలు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ పిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. తమ ఫిర్యాదులపై కేసులు నమోదు చేయకపోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్పీ, పోలీస్ కమిషనరేట్ల ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది.
అయితే ముందు జాగ్రత్తగా కాంగ్రెస్ పార్టీ కీలక నేతలను ఇవాళ పోలీసులు హౌస్ అరెస్టులు చేశారు. అదే సమయంలో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మపై కేసు నమోదు చేసినట్టుగా హైద్రాబాద్ సీపీ ప్రకటించారు. అన్ని ఫిర్యాదులపై జీడీలు ఎంట్రీ చేసి జూబ్లీహిల్స్ పోలీసులే దర్యాప్తు చేస్తారని సీపీ ప్రకటించారు.రాహుల్ గాంధీపై అసోం సీఎం బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ తరహ వ్యాఖ్యలను సీఎం హోదాలో ఉండి శర్మ చేయడాన్ని కేసీఆర్ తప్పుబట్టారు. బిశ్వ శర్మపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు బీజేపీ నాయకత్వాన్ని డిమాండ్ చేశారు.