తనను ప్రేమించడానికి నిరాకరించడంతో బాధితురాలిపై రోహిత్ దాడికి దిగారని నల్గొండ ఎస్పీ చెప్పారు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో కేు నమోదు చేశామన్నారు.
నల్గొండ:తనను ప్రేమించేందుకు ఒప్పుకోకపోవడంతోనే రోహిత్ బాధితురాలిపై దాడి చేశాడని నల్గొండ ఎప్పీ రెమా రాజేశ్వరి చెప్పారు. నల్గొండలో మంగళవారం నాడు రోహిత్ అనే యువకుడు ఓ యువతిపై కత్తితో దాడికి దిగాడు.ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
బుధవారం నాడు తన కార్యాలయంలో ఈ ఘటనకు సంబంధించిన వివరాలను నల్గొండ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి మీడియాకు వివరించారు.బాధితురాలితో మాట్లాడాలని తన స్నేహితుడి సహాయంతో పిలిపించి నిందితుడు మీసాల రోహిత్ ఈ దాడి చేశారని ఎస్పీ చెప్పారు. నిన్న మధ్యాహ్నం మిర్యాలగూడ రోడ్డులోని ఫారెస్ట్ పార్క్ వద్దకు బాధితురాలు ఆమె స్నేహితురాలితో పాటు మరో యువకుడు కూడా వెళ్లారని ఎస్పీ తెలిపారు.
undefined
గతంలో కూడా రోహిత్ బాధితురాలిని వేధింపులకు గురి చేశారని ఎస్పీ చెప్పారు. ప్రేమించమని రోహిత్ బాధితురాలిపై ఒత్తిడి తెచ్చినట్టుగా ఎస్పీ వివరించారు. తనకు ఇంట్రెస్ట్ లేదని బాధితురాలు చెప్పడంతో ఆమెపై నిందితుడు కక్ష పెంచుకొన్నాడన్నారు.
గతంలో ఇలానే బాధితురాలిని రోహిత్ బెదిరించాడన్నారు. అయితే ఈ విషయాన్ని బాధితురాలు తన ఇంట్లో చెప్పలేదన్నారు. హైద్రాబాద్ లో ఉన్న తన సోదరుడికి ఫోన్ లో చెప్పిందన్నారు. అయితే ఈ విషయమై షీ టీమ్ కు ఫిర్యాదు చేయాలని తొలుత భావించారనుకున్నారని చెప్పారు. అయితే రోహిత్ ఇంట్లో ఈ విషయం చెబితే సరిపోతుందని బాధితురాలే తన సోదరుడికి చెప్పడంతో షీ టీమ్స్ కు ఫిర్యాదు చేయలేదని తమ దర్యాప్తులో తేలిందని ఎస్పీ రాజేశ్వరి తెలిపారు.
ఈ ఘటన తర్వాత తన స్నేహితుడిని బతిమిలాడి నవ్యతో మాట్లాడేందుకు తన వద్దకు రప్పించాలని కోరాడు. చివరి సారి మాట్లాడి ఆమెను ఒప్పిస్తానని రోహిత్ తన స్నేహితుడికి చెప్పాడన్నారు. దీంతో రోహిత్ స్నేహితుడు ఈ సమాచారాన్ని బాధితురాలికి చేరవేసినట్టుగా ఎస్పీ తెలిపారు.మరో స్నేహితురాలితో కలిసి టూ వీటర్ పై మిర్యాలగూడ ఫారెస్ట్ కార్యాలయం వద్ద ఉన్న పార్క్ వద్దకు బాధితురాలు చేరుకుందన్నారు అప్పటికే అక్కడే ఉన్న రోహిత్ బాధితురాలిని ప్రేమించమని వేధించాడని తమ దర్యాప్తులో తేలిందన్నారు. అయితే బాధితురాలు ఒప్పుకోకపోవడంతో తన వెంట తెచ్చుకొన్న కత్తితో రోహిత్ బాధితురాలిపై దాడికి దిగినట్టుగా ఎస్పీ వివరించారు. అయితే రోహిత్ దాడి చేసే సమయంలో బాధితురాలు ప్రతిఘటించడంతో ప్రాణాపాయం నుండి తప్పించుకొందన్నారు. ఆసుపత్రిలో ఆమెకు సర్జరీ చేశారని ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి నిలకడగా ఉందని ఎస్పీ రాజేశ్వరి వివరించారు.
also read:నల్గొండలో ప్రేమోన్మాది దాడిలో గాయపడిన యువతికి సర్జరీ: పోలీసుల అదుపులో రోహిత్
ఈ కేసు దర్యాప్తును డీఎస్పీ స్థాయి అధికారి విచారణ చేస్తారన్నారు. తాను కూడా ఈ విచారణను స్వయంగా పర్యవేక్షించనున్నట్టుగా కూడా ఎస్పీ చెప్పారు.
రోహిత్ తో పాటు బాధితురాలు ఇద్దరూ క్లాస్ మేట్స్ అని ఎస్పీ తెలిపారు. ఈ తరహా వేధింపులకు పాల్పడితే ధైర్యంగా ఫిర్యాదు చేయాలని ఎస్పీ కోరారు. యవతిపై రోహిత్ దాడి చేసి పారిపోయేందుకు పట్టణ శివారులో ఉన్న సమయంలో అరెస్ట్ చేసినట్టుగా ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు.