Road Accident: రెండు కార్లు ఢీ.. కొడంగల్‌లో ముగ్గురి మృతి

Published : Apr 27, 2025, 06:25 PM IST
Road Accident: రెండు కార్లు ఢీ.. కొడంగల్‌లో ముగ్గురి మృతి

సారాంశం

Road Accident: కొడంగల్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.  

Road Accident: వికారాబాద్ జిల్లాలోని కొడంగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఆదివారం రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన ముగ్గురు బాధితులు కర్ణాటకలోని దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని సందర్శించి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానిక ఎస్సై సత్యనారాయణ తెలిపారు. చిట్లపల్లి - యలమద్ది గ్రామాల మధ్య జాతీయ రహదారిపై వారి కారును ఒక SUV ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురూ అక్కడికక్కడే మరణించారు. 

మృతదేహాలను కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని పోలీసులు తెలిపారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక తెలంగాణలో 5°C టెంపరేచర్స్.. ఈ ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్
School Holidays : వచ్చే బుధ, గురువారం స్కూళ్లకు సెలవేనా..?