Nizamabad Accident: ఆర్టీసి బస్సు-ఆటో ఢీ... స్పాట్ లోనే అత్తా అల్లుడి దుర్మరణం

By Arun Kumar PFirst Published Jan 23, 2022, 7:43 AM IST
Highlights

వ్యాపార పనుల్లో భాగంగా ఆటోలో ప్రయాణిస్తున్న అత్తా అల్లుడిని ఆర్టిసి బస్సు రూపంలో మృత్యువు కబళించింది. ఈ విషాద సంఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. 

నిజామాబాద్: వేగంగా వెళుతున్న ఆర్టిసి బస్సు-ఆటో ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో ఒకే  కుటుంబానికి చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర ప్రమాదం (road accident) నిజామాబాద్ జిల్లా (nizamabad district) వేల్పూరు మండలంలో చోటుచేసుకుంది.

జగిత్యాల (jagitial) జిల్లా మెట్ పల్లి metpalli)కి చెందిన పోసాని(60), ఆమె అల్లుడు తిరుపతయ్య(40) కూరగాయల వ్యాపారం చేస్తుంటారు. అయితే శనివారం వీరిద్దరు కూరగాయలు కొనేందుకు ఓ ఆటోలో అంకాపూర్ (ankapur) వెళ్లారు. కూరగాయలను ఆటోలో వేసుకుని తీసుకువస్తుండగా వేల్పూరు మండలం లక్కోర గ్రామం వద్దకు రాగానే రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.  

వేగంగా వెళుతున్న వీరు ప్రయాణిస్తున్న ఆటోను అంతే వేగంతో వస్తున్న ఆర్టిసి బస్సు ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ఆటో తుక్కుతుక్కయి అందులో ప్రయాణిస్తున్న అత్తాఅల్లుడు పోసాని, తిరుపతయ్య ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. 

రోడ్డుప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఆటోలో చిక్కుకున్న ఇద్దరి మృతదేహాలను బటయకు తీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు  చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఆటో పూర్తిగా ధ్వంసమవగా బస్సు ముందుభాగా స్వల్పంగా దెబ్బతింది. 

ఇదిలావుంటే బొగ్గులోడ్ తొ వెళుతున్న లారీ- ప్రయాణికులతో వెళుతున్న బస్సు ఢీకొన్ని ఆరుగురు ప్రాణాలు కోల్పోగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోరం ఒడిషా రాష్ట్రంలో చోటుచేసుకుంది.

బాలాసోర్ జిల్లాలోని (Balasore district) సోరో పోలీసు స్టేషన్ పరిధిలో NH-16‌పై బిదు చక్ వద్ద ఆగివున్న బస్సును లారీ ఢీకొట్టింది. శనివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా... పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే గాయపడినవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. ‘శాంతిలత’ అనే పేరుతో ఉన్న బస్సు Mayurbhanj districtలోని మనత్రి నుంచి ఉడాలా మీదుగా భువనేశ్వర్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.  

శనివారం మధ్యాహ్నం సమయంలో సోరో సమీపంలోని బస్ స్టాప్ వద్ద బస్సు ఆగి ఉన్న సమయంలో.. బొగ్గుతో కూడి ట్రక్కు వేగంగా దూసుకొచ్చి వెనకాల నుంచి బస్సును బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డుపై నుంచి పక్కకు పడిపోయింది. దీంతో ఘటన స్థలంలోనే ముగ్గురు మరణించారు. మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతు మృతిచెందారు. మృతుల్లో ఏడాది చిన్నారి కూడా ఉన్నారు.ః

ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన వారిని సోరోలోని ఆస్పత్రి, బాలసోర్ జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

 


 

click me!