కేటిఆర్ పై చిరంజీవి డైలాగ్ పేల్చిన రేవంత్ రెడ్డి

Published : Nov 02, 2017, 02:44 PM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
కేటిఆర్ పై చిరంజీవి డైలాగ్ పేల్చిన రేవంత్ రెడ్డి

సారాంశం

కేటిఆర్ కు క్రొకడైల్ ఫెస్టివల్ చూపిస్తా అంటున్న రేవంత్ కాంగ్రెస్ లో చేరడంతో కొత్త రూట్ లో కేటిఆర్ ను టార్గెట్ చేసిన రేవంత్

పొద్దున లేస్తే కేసిఆర్ మీద, కేటిఆర్ మీద ఏక బిగిన విమర్శలు చేసే రేవంత్ రెడ్డి తాజాగా రూట్ మార్చారు. గతంలో మాదిరిగా కాకుండా రేవంత్ కొత్త పంథా చేపట్టారు. అయితే రూట్ మాత్రమే కొత్తది కానీ... మిగతాదంతా సేమ్ టు సేమ్ అన్నట్లే ఉంది పరిస్థితి. ఇంతకూ విషయం ఏమంటారా?

 

తెలంగాణ ఐటి మంత్రి కేటిఆర్ తాను అనేక అంశాలపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తారు. ఆయన ట్విట్టర్ ద్వారా ఎన్నో ప్రయోజయోగ పనులు చేపట్టారు. ఇక ఈ సంగతి ఇట్ల ఉంచితే... నిన్న కొడంగల్ కు చెందిన టిడిపి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వందల సంఖ్యలో కేటిఆర్ సమక్షంలో తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ గూటికి చేరారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రేవంత్ మీద ఘాటైన పదజాలంతో కేటిఆర్ విమర్శలు గుప్పించారు. రేవంత్ ఒక దొంగ అని... దొంగను జైల్లనే ఉంచుతరు కదా అని ఘాటుగా తిట్టిపోశారు.

దీనికి రేవంత్ రెడ్డి ఎఫ్పుడెప్పుడు ప్రెస్ మీట్ పెట్టి కేటిఆర్ మీద విరుచుకుపడతాడా అని ఆయన అభిమానులు ఎదురుచూశారు. కానీ గతంలో అంటే రేవంత్ టిడిపిలో పెద్ద లీడర్ గా ఉన్నడు కాబట్టి ఆయన ఎప్పుడంటే అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి కేటిఆర్ ను కడిగిపారేసేవాడే. కానీ.. ఇప్పుడు కాంగ్రెస్ ల చేరిండు కదా? అందుకే ఇక్కడ సవాలక్ష నిబంధనలు ఉంటాయి కదా? అదంతా ఎందుకనుకున్నడో ఏమో రూట్ మార్చి కేటిఆర్ మీద విరుచుకుపడ్డడు.

రూట్ మార్చడమంటే... రేవంత్ ట్విట్టర్ బాయ్ అవతారమెత్తిండు. ఇప్పటి వరకు తెలంగాణలో టాప్ మోస్ట్ ట్విట్టర్ బాయ్ గా పేరుతెచ్చుకున్న కేటిఆర్ కు ట్విట్టర్ లోనే సమాధానం చెప్పిండు రేవంత్.  అంతేకాదు ఈ సమాధానం కూడా చిరంజీవి డైలాగ్ తో ఉండడం ఆసక్తికరంగా ఉంది. కేటిఆర్ కు ఇన్ ఫ్రంట్ క్రొకొడైల్ ఫెస్టివల్ అంటూ కామెంట్ పెట్టిండు. అంతేకాదు తెలంగాణ స్కాం కింగ్ కేటిఆర్ అంటూ మరో ఘాటైన తిట్టు కూడా అందులో జత చేసిండు.

ఈ విమర్శల్లో అసలు విషయం ఏమంటే జనాల సొమ్ముతో జల్సాలు చేసి జైలుపాలైన సత్యం రామలింగరాజు తనయుడు తేజారాజుతో కలిసి 2016లో మలేషియన్ ప్రధానితో దిగిన ఫొటోను ట్విట్టర్ లో రిలీజ్ చేశారు రేవంత్. కోట్లు కొల్లగొట్టి జైలుపాలైన సత్యంరామలింగరాజు కొడుకుతో కలిసి మలేషియన్ ప్రధాని నజీబ్ రజాక్ ని ఎందుకు కలిశారో సమాధానం చెప్పాలని రేవంత్ సవాల్ చేశారు. మలేషియన్ ప్రధానితో దొంగ కొడుకుతో కలిసి ఏం మంతనాలు ఆడారో చెప్పాలని నిలదీశారు. కేటిఆర్ కు ముందుంది క్రొకడైల్ ఫెస్టివల్ అంటూ... పోస్టు సంధించారు.

అందులోనే ‘ఇదిగో కేటిఆర్ దాచిన సత్యం’ అంటూ పత్రికా ఫొటోను రిలీజ్ చేశారు. వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డ సత్యం రాజలింగరాజు సుపుత్రుడితో కేటీఆర్ మలేషియాలో రహస్యంగా వెలగబెట్టిన నిర్వాకం ఏమిటో ఆయనే చెప్పాలని రేవంత్ ఎద్దేవా చేశారు. స్కాం స్టార్లతో తిరుగుతున్న దొరకని దొంగ ఎవరన్న ''సత్యం'' తెలంగాణా సమాజం గుర్తించాలని రేవంత్ రెడ్డి సూచించారు.

మొత్తానికి కాంగ్రెస్ లోకి మారగానే రేవంత్ రెడ్డి వర్కింగ్ స్టైల్ కూడా మారిపోవడం పట్ల ఆయన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

 

రేవంత్ పై మంత్రి తలసాని కరుకు విమర్శలు

ఈ వార్తతోపాటు మరిన్ని వార్తల కోసం కింద క్లిక్ చేయండి

https://goo.gl/8G75kg

 

 

PREV
click me!

Recommended Stories

Hyderabad: కేవలం రూ. 1 కే కడుపు నిండా భోజనం..
KTR Counter to Uttam Kumar Reddy: కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు| Asianet News Telugu