Top Stories: సీఎంగా రేవంత్ ప్రమాణం.. గ్రామ పంచాయతీ ఎన్నికలపై ఈసీ ఆర్డర్.. 4.7 లక్షల ఎకరాల పంట నష్టం

By Mahesh K  |  First Published Dec 7, 2023, 6:29 AM IST

నేడు మధ్యాహ్నం 1.04 గంటలకు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి సీఎంగా, మరికొందరు  ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం తీసుకుంటారు. వచ్చే నెలాఖరుతో గ్రామపంచాయతీ పాలకమండళ్ల కాల పరిమితి ముగియనుండటంతో పోలింగ్ కోసం ఈసీ పనులు మొదలు పెట్టింది. తుఫాన్ వల్ల కురిసిన భారీ వర్షానికి రాష్ట్రంలో 4.7 లక్షల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది.
 


హైదరాబాద్: సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి బుధవారం రాత్రి ఢిల్లీ నుంచి తిరిగి వచ్చారు. హైదరాబాద్‌లోని బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకోగా కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. డీజీపీ రవి గుప్తా, హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్యలు కలిశారు. అక్కడి నుంచి ఎల్లా హోటల్‌కు వెళ్లిన రేవంత్ ఈ రోజు ఉదయం ఎల్బీ స్టేడియానికి ప్రమాణ స్వీకారానికి రాబోతున్నారు. రేవంత్ రెడ్డితోపాటు మరో 8 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసే అవకాశం ఉన్నది. అధికారులు భారీగా బందోబస్తు చేశారు. కార్యక్రమ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి లక్ష మంది వస్తారనే అంచనా.

తుఫాన్ వల్ల 4.7 లక్షల ఎకరాల్లో పంట నష్టం:

Latest Videos

రాష్ట్రంలో తుఫాన్‌తో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ తుఫాన్ వల్ల కురిసిన కుండపోత వానల్లో వరిపంట నీట మునిగింది. మంగళ, బుధ వారాల్లో కురిసిన భారీ వర్షాల్లో రాష్ట్రవ్యాప్తంగా 4.72 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయింది. ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే లక్ష ఎకరాల్లో పంట నష్ట జరిగింది. వరి పైరు, మిర్చి, పత్తి వంటి పంటలు నాశనం అయ్యాయి. ఖమ్మంతోపాటు వరంగల్‌లోని 12 మండలాల్లో, ములుగు జిల్లా, భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లిలో పలు మండలాల్లో తుఫాన్ వల్ల కురిసిన వర్షాల్లో పంట దెబ్బతిన్నది. మరో వైపు ధాన్య కొనుగోళ్లు నత్తనడకన జరుగుతున్నాయి. తమను ఆదుకోవాలని రైతులు ఆవేదనతో కోరుతున్నారు.

Also Read: Chandrababu: రేవంత్ రెడ్డితో చంద్రబాబుకు పెద్ద చిక్కే వచ్చిందిగా! ఆలోచించే టైం లేదు.. నిర్ణయమే ముఖ్యం

సీఎం.. కేసీఆర్..:

ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్‌ వద్దకు 9 బస్సుల్లో చింతమడక గ్రామస్తులు వచ్చారు. ఈ సందర్భంగా జై కేసీఆర్, సీఎ.. సీఎం.. సీఎం కేసీఆర్ వంటి నినాదాలు చేశారు. కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చారు. ఎవరూ అధైర్యపడవద్దని, పార్టీ ఎప్పుడూ వారికి అండగా ఉంటుందని కేసీఆర్ వారికి చెప్పారు. ఎల్లప్పుడూ జనంలో ఉండే హరీశ్ రావు మీకు తోడుగా ఉంటారని, ఎవరూ భయపడవద్దని సూచించారు.

Also Read: Revanth Reddy: పార్లమెంటులో వివాదం.. రేవంత్ రెడ్డిపై బీజేపీ ఫైర్.. ఇంతకీ రేవంత్ ఏమన్నారు?

ఈ ప్రభుత్వానికి ఆరు నెలలో.. ఏడాదో.. :

బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులకుప్ప చేసిందని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు చేయకుంటే ఆరు నెలలు.. లేదా ఏడాదిలో పతనం అవుతుందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికి రేవంత్ ప్రభుత్వం సరిపోతుందని, ఆరు గ్యారంటీల అమలు కష్టమని అన్నారు.

Also Read: Vote Share: కమ్యూనిస్టులు బీజేపీని ఎదుర్కోగలరా? మూడు అసెంబ్లీ ఎన్నికలు మనకు చెప్పే పాఠం ఏమిటీ?

మాకు 54 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు:

స్టేషన ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌కు 39, మిత్రపక్షం ఎంఐఎంకు ఏడు, బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు.. మొత్తంగా 54 ఎమ్మెల్యేలు తమకు ఉన్నాయని కండియం అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనన్న ఆరోపణలకు బలం చేకూర్చేలా ఆయన కామెంట్లు చేశారు. ఆరు నెలలా.. ఏడాదా.. మూడేళ్లా.. అనేది పక్కనపెడితే మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని, మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. బొటాబొటీ మెజార్టీ వచ్చిన కాంగ్రెస్ పార్టీ దాని ఎమ్మెల్యేలను కాపాడుకోగలదా? అనేది వేచి చూడాల్సిందేనని చెప్పారు.

Also Read: Telangana Cabinet: తెలంగాణకు ఇద్దరు డిప్యూటీ సీఎంలు! సీతక్కకు ఏ శాఖ?

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలి:

అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయో లేదో.. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభం అవుతున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీతో గ్రామ పంచాయతీ పాలక మండళ్ల కాల పరిమితి ముగుస్తున్నది. అంతకంటే మూడు నెలల ముందే ఎన్నికలు నిర్వహించాలని చట్టం ఉన్నదని కలెక్టర్లుకు ఎన్నికల సంఘం పంపిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నెల 30వ తేదీలోపు రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బంది జాబితాను రూపొందించి, వారికి ట్రెయినింగ్ ఇశ్వాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది.

click me!