తెలంగాణలో మరో నాలుగు నెలల్లో మొత్తం ఏడు ఎంపీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. అందులో నాలుగు బీఆర్ఎస్‌కు చెందినవే కావడం గమనార్హం. కొత్త ప్రభాకర్ రెడ్డి తన లోక్ సభ స్థానానికి రాజీనామా చేయబోతుండగా.. మరో ముగ్గురు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ఏప్రిల్ 2వ తేదీతో ముగియనుంది. అలాగే.. ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు అసెంబ్లీ బరిలో నెగ్గిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు తమ ఎంపీలను కూడా బరిలోకి దించిన సంగతి తెలిసిందే. ఇందులో కొందరు ఓడిపోగా.. మరికొందరు గెలిచారు. బీజేపీ నుంచి ముగ్గురు ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావులు ఓడిపోయారు. కాంగ్రెస్ నుంచి ముగ్గురు ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అనుముల రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు పోటీ చేసి గెలిచారు. బీఆర్ఎస్ నుంచి మెదక్ ఎంపీ దుబ్బాక అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. త్వరలోనే వీరంతా తమ పార్లమెంటు స్థానాలకు రాజీనామా ఇవ్వనున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు లోక్ సభ స్పీకర్‌కు తమ రాజీనామాలు సమర్పించారు.
Also Read: CM Revanth Reddy: రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం చెక్.. కేసీ వేణుగోపాల్ సంచలన స్టేట్‌మెంట్
ఈ నాలుగు స్థానాలతోపాటు మూడు రాజ్యసభ స్థానాలు కూడా ఖాళీ కాబోతున్నాయి. వీరంతా బీఆర్ఎస్‌కు చెందిన రాజ్యసభ సభ్యులే కావడం గమనార్హం. రాజ్యసభ సభ్యులు బాడుగుల లింగయ్య యాదవ్, జే సంతోశ్ కుమార్, వడ్డిరాజు రవిచంద్రల పదవీ కాలం మరో నాలుగు నెలల్లో ముగిసిపోతన్నది. వచ్చే ఏడాది ఏప్రిల్ 2తో వీరి టెన్యూర్ ముగుస్తున్నది. అంటే ఈ నాలుగు స్థానాలు కూడా ఖాళీ అవుతాయి.