
హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బుధవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నుండి ఆయన బాధ్యతలు స్వీకరించారు.బుధవారం నాడు ఉదయం జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మగుడిలో రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దమ్మగుడి నుండి ర్యాలీగా ఆయన నాంపల్లి మీదుగా గాంధీ భవన్ కు చేరుకొన్నారు. నాంపల్లిలోని దర్గా వద్ద ఆయన ప్రత్యేకంగా ప్రార్ధనలు చేశారు. దర్గాలో చాదర్ ను సమర్పించారు. అక్కడి నుండి ఆయన గాంధీ భవన్ కు చేరుకొన్నారు.
also read:పెద్దమ్మగుడిలో రేవంత్ పూజలు: గాంధీభవన్ కు ర్యాలీగా
గాంధీ భవన్ లో వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకొన్న తర్వాత ఆయన పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించారు. పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి నుండి రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, పలువురు పార్టీ నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.