రేపు షర్మిల పార్టీ ప్రకటన.. ప్రత్యేక విమానంలో ఇడుపులపాయనుంచి బేగంపేటకు...

By AN TeluguFirst Published Jul 7, 2021, 2:13 PM IST
Highlights

రేపు ఉదయం 10.30 గంటలకు వైఎస్ షర్మిల ఇడుపుల పాయ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్, బేగంపేటకు రానున్నారు. తెలంగాణ సంప్రదాయం ప్రకారం బోనాలు, వేడుకలతో ఫర్మిలకు అభిమానులు ఆహ్వానం పలకనున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ర్యాలీగా బయలుదేరి షర్మిల జేఆర్సీ కన్వెన్షన్ కు రానున్నారు. 
 

రేపు ఉదయం 10.30 గంటలకు వైఎస్ షర్మిల ఇడుపుల పాయ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్, బేగంపేటకు రానున్నారు. తెలంగాణ సంప్రదాయం ప్రకారం బోనాలు, వేడుకలతో ఫర్మిలకు అభిమానులు ఆహ్వానం పలకనున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ర్యాలీగా బయలుదేరి షర్మిల జేఆర్సీ కన్వెన్షన్ కు రానున్నారు. 

సాయంత్రం 5 గంటలకు షర్మిల పార్టీ ప్రకటనతో పాటు జెండా, ఎజెండాను వెల్లడించనున్నారని వెస్సార్టీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత కూడా ప్రజలు సంతోషంగా లేరన్నారు. అందుకే పార్టీ పెడుతున్నామని.. రాజన్న చెప్పిన సంక్షేమమే తమ ధ్యేయమని కొండా రాఘవరెడ్డి వెల్లడించారు. 

కాగా, ఇంతకుముందే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్ షర్మిల తెలంగాణ పార్టీ జెండా ఖరారైంది. వైఎస్సార్ తెలంగాణ పార్టీని ఆమె ఈ నెల 8వ తేదీన ప్రారంభించనున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఆమె తన పార్టీకి శ్రీకారం చుడుతున్నారు. పార్టీ పేరును ప్రకటించి, ప్రారంభించడానికి వేదిక కూడా ఖరారైంది. 

షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీ జెండాను రాష్ట్ర పక్షి అయిన పాలపిట్ట రంగులో రూపొందించారు. జెండాలో 80 శాతం మేర పాలపిట్ట రంగు, మిగిల 20 శాతం నీలం రంగు ఉంటుంది. జెండాలో మధ్యలో తెలంగాణ తెలంగాణ భౌగోళిక స్వరూపం, అందులో వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రం ఉండే విధంగా జెండాను రూపొందించారు. 

వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని హైదరాబాదులోని ఫిలింనగర్ లో గల జేఆర్సీ సెంటర్ లో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం లోటస్ పాండులోని తన కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ ను షర్మిల ఆవిష్కరిస్తారు. 

ఈ నెల 8వ తేదీన పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను పూలతో అలకరించాలని వైఎస్ విగ్రహాల పరిరక్షణ కమిటీ కో ఆర్డినేటర్ నీలం రమేష్ పిలుపునిచ్చారు. 

click me!