అజారుద్దీన్ కు హైకోర్టులో చుక్కెదురు: హెచ్‌సీఏ కౌన్సిల్ రద్దుపై స్టే

By narsimha lodeFirst Published Jul 7, 2021, 1:24 PM IST
Highlights

హైద్రాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అజారుద్దీన్ కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. హెచ్‌సీఏ  అపెక్స్ కౌన్సిల్ ను రద్దు చేస్తూ రెండు రోజుల క్రితం అంబుడ్స్ మెన్  నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వైరి వర్గం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై బుధవారం నాడు హైకోర్టు విచారణ నిర్వహించింది. ఈ విచారణలో   అంబుడ్స్ మెన్ ప్రకటనపై స్టే విధించింది హైకోర్టు.


హైదరాబాద్: హైద్రాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అజారుద్దీన్ కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. హెచ్‌సీఏ  అపెక్స్ కౌన్సిల్ ను రద్దు చేస్తూ రెండు రోజుల క్రితం అంబుడ్స్ మెన్  నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వైరి వర్గం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై బుధవారం నాడు హైకోర్టు విచారణ నిర్వహించింది. ఈ విచారణలో   అంబుడ్స్ మెన్ ప్రకటనపై స్టే విధించింది హైకోర్టు.

అంబుడ్స్ మెన్ రద్దు చేసిన వారి స్థానంలో  అజారుద్దీన్  కొత్తవారిని అపెక్స్ కౌన్సిల్ లో నియమించుకొన్నారు.  హెచ్‌సీఏ కౌన్సిలర్ గా పార్ధ్ సత్వాల్కర్ కు అడిషనల్ చార్జీ అందించారు. హెచ్‌సీఏ కోశాధికారిగా సంతోష్ దవారే, సెక్రటరీగా అజార్ ను నియమించారు.అంతకుముందే అపెక్స్ కౌన్సిల్ హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న అజారుద్దీన్ ను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అజారుద్దీన్ తీసుకొన్న నిర్ణయాన్ని వైరి వర్గం హైకోర్టులో సవాల్ చేసింది. అంబుడ్స్ మెన్ తీసుకొన్న నిర్ణయం పై హైకోర్టు స్టే విధించింది. హెచ్‌సీఏలో రోజుకో  పరిణామం చోటు చేసుకొంటుంది. 

click me!