రేవంత్ రెడ్డి జిమ్మిక్కు: భూదందా ఆరోపణలపై చెప్తానని, మధ్యలో అదృశ్యమై...

By telugu teamFirst Published Mar 2, 2020, 6:11 PM IST
Highlights

అక్రమ భూఆక్రమణలకు పాల్పడినట్లు తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్తానని జర్నలిస్టులను ఆహ్వానించి వారిని ఆయన వెంట తిప్పారు. మధ్యలో వారి నుంచి అదృశ్యమై ప్రైవేట్ స్థలానికి చేరుకున్నారు

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెసు నేత, మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు జర్నలిస్టులతో ఆటాడుకున్నారు. అక్రమ భూలావాదేవీలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై మాట్లాడుతానని రేవంత్ రెడ్డి జర్నలిస్టులను ఆహ్వానించారు. హైదరాబాదు సమీపంలోని గోపన్  పల్లిలో రేవంత్ రెడ్డి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

ఆ ఆరోపణలపై మీడియా సమావేశం పెడుతున్నట్లు ఆయన జర్నలిస్టులను ఆహ్వానించారు. జర్నలిస్టులు వచ్చిన తర్వాత దానిపై మాట్లాడకుండా వారిని తన వెంటేసుకుని తిప్పారు. ఆ తర్వాత మధ్యలో వారికి కనిపించకుండా వెళ్లారు. మళ్లీ వచ్చి ప్రైవేట్ భూముల వద్దకు తీసుకుని వెళ్లారు.

Also read: జన్వాడలో ఉద్రిక్తత: కేటీఆర్ ఫామ్‌హౌస్‌ వద్ద కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్

చివరకు ఆయన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని జన్వాడ వద్ద గల టీఆర్ెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు ఫామ్ హౌస్ వద్దకు వెళ్లారు. కేటీఆర్ ఫామ్ హౌస్ 25 ఎకరాల విస్తీర్ణంలో ఉది. నిబంధనలకు విరుద్ధంగా ఫామ్ హౌస్ ను నిర్మించారని, అది 11 జీవోకు వ్యతిరేకంగా ఉందని ఆనయ ఆరోపించారు. 

జన్వాడాలోని ఫామ్ హౌస్ లోకి చొచ్చుకుని వెళ్లేందుకు ప్రయత్నించిన రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. మరో కాంగ్రెసు నేత కొండా విశ్వేశ్వర రెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. 

వీడియో చూడండి: తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అరెస్ట్

click me!