చంపేస్తామని బెదిరింపులు..: పోలీసులకు ఫిర్యాదు చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Published : Mar 11, 2023, 01:51 PM IST
చంపేస్తామని బెదిరింపులు..: పోలీసులకు ఫిర్యాదు చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

సారాంశం

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పోలీసులను ఆశ్రయించారు. తనను చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయని బంజారాహిల్స్ పోలీసులకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫిర్యాదు చేశారు.

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పోలీసులను ఆశ్రయించారు. తనను చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయని బంజారాహిల్స్ పోలీసులకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫిర్యాదు చేశారు. తనను చంపుతామంటూ కొంతమంది బెదిరింపులకు గురి చేస్తున్నారని, సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన వద్ద ఉన్న వీడియోలు, చాటింగ్ లిస్ట్‌ను పోలీసులకు అందించారు. తనపై బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు.. నిందితులను గుర్తించేందుకు విచారణ చేపట్టారు. 

ఇదిలా ఉంటే.. టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్, ఆయన కుమారుడు డాక్టర్ సుహాస్‌లను కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బెదిరింపులకు పాల్పడినట్టుగా చెబుతున్న ఫోన్ కాల్ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి  తెలిసిందే. సుహాస్‌కు ఫోన్ చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. సుధాకర్ తనను వందసార్లు తిట్టాడని.. కార్లలో అతనిని చంపడానికి తిరుగుతున్నారని అన్నారు. ‘‘నిన్ను కూడా చంపుతారు.. నీ ఆస్పత్రిని కూడా కూలగొడతారు’’ అని సుహాస్‌తో అన్నారు. ఇందుకు సంబంధించిన ఆడియో క్లిప్ వైరల్‌గా మారడంతో తీవ్ర కలకలం రేగింది. 

అయితే ఇందుకు సంబంధించి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను భావోద్వేగంతో చేసిన వ్యాఖ్యలే తప్ప దీని వెనకాల వేరే ఉద్దేశం లేదని తెలిపారు. నకిరేకల్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటీ నుంచి తనను తిడుతున్నాడని అన్నారు. చెప్పలేని మాటలు అంటున్నాడని తెలిపారు. మూడు  నెలలుగా సోషల్ మీడియా వేదికగా ఒకటే దూషణలు చేస్తున్నారని అన్నారు. దరిద్రుడని, చీడపురుగు అని తిడుతున్నారని.. దాని గురించి అడగడానికే ఫోన్ చేశానని చెప్పారు. 33 ఏళ్ల రాజకీయ జీవితంలో తాను ఎప్పుడూ ప్రత్యర్థులను దూషించలేదని తెలిపారు. శత్రువులు, ప్రత్యర్థులను కూడా దగ్గరికి తీసే మనస్తత్వం తనదని చెప్పారు. 

అయితే తాను మాట్లాడిన చాలా  విషయాలను కట్ చేశారని అన్నారు. కొన్ని మాటలను మాత్రమే లీక్ చేశారని చెప్పారు. తాను మాట్లాడే సమయంలో కొంత భావోద్వేగానికి గురైనట్టుగా చెప్పారు. తాను ముందు చెప్పిన మాటలను కట్ చేసి ఆడియో లీక్ చేశారని.. దీనిని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. తన కొడుకు పేరుతో ఫౌండేషన్ పెట్టి ఎంతో సేవ చేశానని అన్నారు. 

ఈ క్రమంలోనే భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై చెరుకు సుధాకర్, ఆయన కొడుకు సుహాస్‌లకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై ఐపీసీ 506 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. 

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు