మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి నివాసానికి రేవంత్.. కాంగ్రెస్‌లో చేరికకు డేట్ ఫిక్స్.. !!

Published : Jun 16, 2023, 01:16 PM IST
మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి నివాసానికి రేవంత్.. కాంగ్రెస్‌లో చేరికకు డేట్ ఫిక్స్.. !!

సారాంశం

తెలంగాణ కాంగ్రెస్‌‌లో భారీగా చేరికలు ఉంటాయనే ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌లో చేరికలకు సంబంధించి ఆ పార్టీ నాయకులు  పలువురు నాయకులు మంతనాలు జరుపుతున్నారు. 

తెలంగాణ కాంగ్రెస్‌‌లో భారీగా చేరికలు ఉంటాయనే ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌లో చేరికలకు సంబంధించి ఆ పార్టీ నాయకులు  పలువురు నాయకులు మంతనాలు జరుపుతున్నారు. తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి నివాసానికి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. అయితే గుర్నాథ్ రెడ్డి ఆదివారం కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది.  

ఇక, రేవంత్ సొంత నియోజవకర్గానికి కొండగల్‌కు చెందిన గుర్నాథ్ రెడ్డి.. గత కొంతకాలంగా గుర్నాథ్ రెడ్డి బీఆర్ఎస్‌కు దూరంగా ఉంటున్నారు.  ప్రస్తుత కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో గురునాథ్ రెడ్డికి ఎప్పటినుంచో విబేధాలు కొనసాగుతోన్నాయి. ఇరువురి మధ్య ఆధిపత్య, వర్గ పోరు నడుస్తోంది.  ఈ క్రమంలోనే ఆయనను కాంగ్రెస్‌లోకి తీసుకురావాలని రేవంత్ భావించారు. గతంలో కూడా గుర్నాథ్ రెడ్డితో రేవంత్ సమావేశమం అయ్యారు. 


ఇదిలా ఉంటే.. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ నెల 21 తర్వాత  కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలతో సమావేశం అవుతున్నారు. తాజాగా కాంగ్రెస్ సంపత్ కుమార్‌తో జూపల్లి మంతనాలు జరిపారు. ఈ సమావేశంలో తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కొదండరామ్ కూడా పాల్గొన్నారు. అయితే కాంగ్రెస్‌తో కలిసి పనిచేసే అంశంపై సంపత్‌ కుమార్‌తో కొదండరామ్ చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. అయితే తాము కేవలం బ్రేక్ ఫాస్ట్ కోసమే మీట్ అయినట్లు ఈ నేతలు చెప్పినట్లు తెలిసింది.

ఇక, రేపు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో చేరికలకు సంబంధించి కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Real Estate : లక్షల్లో పెట్టుబడి, కోట్లలో లాభం ! హైదరాబాద్ రియల్ ఎస్టేట్ నెక్స్ట్ డెస్టినేషన్ ఇదే
YCP Leaders Protest Against ABN Weekend Comment Over Controversial Remarks | Asianet News Telugu