లండన్ లో హైదరాబాద్ యువతిని చంపిన బ్రెజిల్ యువకుడు అరెస్ట్, కేసు.. మరో ఇద్దరు విడుదల...

Published : Jun 16, 2023, 11:52 AM IST
లండన్ లో హైదరాబాద్ యువతిని చంపిన బ్రెజిల్ యువకుడు అరెస్ట్, కేసు.. మరో ఇద్దరు విడుదల...

సారాంశం

హైదరాబాద్ యువతిని లండన్ కత్తితో పొడిచి చంపిన బ్రెజిల్ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని మీద కేసులు నమోదు చేశారు.   

హైదరాబాద్ : జూన్ 13న హైదరాబాద్‌కు చెందిన కొంతమ్ తేజస్విని రెడ్డి (27) అనే యువతిని హత్య చేసిన బ్రెజిల్ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి, కేసులు నమోదు చేశారు. యువతి, ఆమె స్నేహితురాలిపై కత్తులతో దాడి చేసి.. హత్య చేసిన కేసులో బ్రెజిల్ జాతీయుడు కెవెన్ ఆంటోనియో లౌరెన్‌కో డి మొరైస్‌పై లండన్ పోలీసులు అభియోగాలు మోపారు.

23 ఏళ్ల ఈ దుండగుడు తేజస్వినితో కలిసి ఫ్లాట్‌లో ఉంటున్న మరో తెలుగు యువతి 28 ఏళ్ల అఖిలను కూడా కత్తితో పొడిచి హత్యాయత్నానికి పాల్పడ్డాడని అభియోగాలు మోపారు. అఖిల ప్రాణాపాయం నుంచి బయటపడిందని, స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

హైద్రాబాద్ లో ఐటీ మూడో రోజూ ఐటీ సోదాలు: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లలో తనిఖీలు

లండన్‌లో హైదరాబాద్ మహిళను చంపినందుకు బ్రెజిల్‌ జాతీయుడిపై కేసు నమోదు చేశారు. "ఈ విచారణకు సంబంధించి మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. వారిని తదుపరి చర్యలు తీసుకోకుండా విడుదల చేశారు" అని పోలీసు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

తేజస్విని మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావడానికి ప్రభుత్వం సహకరించాలని ఆమె కుటుంబ సభ్యులు కోరారు. కుటుంబ సభ్యులను పరామర్శించిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే ఎం.కిషన్‌రెడ్డి మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు మున్సిపల్‌ శాఖ మంత్రి కె.టి.రామారావుతో చర్చించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మృతదేహాన్ని యూకే నుంచి స్వదేశానికి తీసుకురావడానికి అవసరమైన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్‌కు సంబంధించి లండన్‌లోని తేజస్విని బంధువు శివరామ్‌రెడ్డితో సంప్రదింపులు జరుపుతున్నట్లు కేంద్ర మంత్రి జి కిషన్‌రెడ్డి కార్యాలయం కూడా తెలిపింది.

తేజస్విని తల్లిదండ్రులు తమ కుమార్తె మరణాన్ని తట్టుకోలేక షాక్‌కు గురయ్యారు. తేజస్విని తొందర్లో లండన్ నుంచి తిరిగి వచ్చి వివాహం చేసుకుంటుందని వారు ఎదురుచూస్తున్నారు. సంబంధం కుదిరిన తర్వాత ఇంటికి వస్తానని ఆమె వారికి చెప్పింది. తేజస్విని 2020లో ఎంఎస్సీ డిగ్రీ కోసం యూకే వెళ్లింది. చదువు పూర్తయ్యాక పార్ట్‌టైమ్ ఉద్యోగంలో చేరింది. వెంబ్లీ అనే ప్రాంతంలో ఉంటుంది. అది తాను పని చేసే ప్రదేశానికి దగ్గరగా ఉండడంతో ఇటీవలే అక్కడికి మారింది. 

బ్రెజిల్ జాతీయుడు తేజస్విని, అఖిల ఉన్న అదే రెంటెడ్ నివాసంలో ప్రత్యేక గదిలో ఉంటున్నాడు. వారం క్రితమే అతను కాంప్లెక్స్‌లోకి వచ్చినట్లు సమాచారం. 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ