ఐటీ దాడులు ముందే ఊహించిన రేవంత్.. అందుకే..?

By sivanagaprasad kodatiFirst Published Sep 27, 2018, 10:19 AM IST
Highlights

తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేయడంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు కొడంగల్, హైదరాబాద్‌లోని రేవంత్ నివాసాలు, వ్యాపార కార్యాలయాలతో పాటు సన్నిహితుల ఇళ్లపైనా ఏకకాలంలో దాడులు చేసి సోదాలు నిర్వహించాయి

తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేయడంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు కొడంగల్, హైదరాబాద్‌లోని రేవంత్ నివాసాలు, వ్యాపార కార్యాలయాలతో పాటు సన్నిహితుల ఇళ్లపైనా ఏకకాలంలో దాడులు చేసి సోదాలు నిర్వహించాయి.

అయితే ఈ దాడులను రేవంత్ ముందుగానే ఊహించారు. తన రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని లక్ష్యంగా చేసుకుని ఐటీ దాడులు జరిగే అవకాశం ఉందని.. రేవంత్ రెడ్డి కొద్దిరోజుల క్రితం సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారు. తనను ఎన్నికల్లో పాల్గొనకుండా చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు.

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన రేవంత్ కొడంగల్ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాల్సి ఉంది. శ్రీవారి దర్శనం అనంతరం నిన్న రాత్రి కొడంగల్ చేరుకున్న ఆయన ఇవాళ ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య ప్రచారం ప్రారంభించాలని ముహూర్తం పెట్టుకున్నారు. సరిగ్గా అదే సమయంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులకు దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు

రేవంత్‌పై ఐటీదాడులు.. ఓడిపోతానేమోనని కేసీఆర్‌కు భయం: ఉత్తమ్
 

click me!