రేవంత్‌పై ఐటీదాడులు.. ఓడిపోతానేమోనని కేసీఆర్‌కు భయం: ఉత్తమ్

sivanagaprasad kodati |  
Published : Sep 27, 2018, 09:57 AM IST
రేవంత్‌పై ఐటీదాడులు.. ఓడిపోతానేమోనని కేసీఆర్‌కు భయం: ఉత్తమ్

సారాంశం

రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు జరగడంపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. రాజకీయ కక్ష సాధింపుతోనే రేవంత్ ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగాయని ఆయన ఆరోపించారు. 

రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు జరగడంపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. రాజకీయ కక్ష సాధింపుతోనే రేవంత్ ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగాయని ఆయన ఆరోపించారు. హైకోర్టు  కొట్టేసిన పాత కేసులను బయటకు తీసి.. కాంగ్రెస్ నేతలను అణగదొక్కేందుకు కుట్ర చేస్తున్నారని ఉత్తమ్ అన్నారు.

మొన్న జగ్గారెడ్డి, ఇవాళ రేవంత్ రెడ్డిపై దాడులు జరగడం.. టీఆర్ఎస్ చేతకాని తనానికి నిదర్శనమన్నారు. కేసీఆర్‌ను ఓటమి భయం వెంటాడుతోందని అందుకే దాడులు చేయిస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. మరికాసేపట్లో టీ.కాంగ్రెస్ నేతలు హైదరాబాద్‌లోని రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లనున్నారు.

రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్