వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎర్రబెల్లి

Published : Sep 27, 2018, 09:44 AM IST
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎర్రబెల్లి

సారాంశం

ఈ ఎన్నికలపై టీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు షాకింగ్ కామెంట్ చేశారు. ప్రజలు వద్దంటే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఎన్నికలపై టీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు షాకింగ్ కామెంట్ చేశారు. ప్రజలు వద్దంటే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ఆయన పేర్కొన్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే...జనగామలోని కడవెండిలో 4.66.30లక్షలు, దేవరుప్పులలో4.83.80లక్షల వ్యయంతో వాగుల్లో చెక్‌డ్యాంల నిర్మాణానికి పాలకుర్తి తాజా మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, దేవరుప్పుల జడ్పీటీసీ నల్ల ఆండాలు కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మహిళలు కోటాలతో, యువకులు డప్పుమేళాలతో స్వాగతం పలికారు.
 
అనంతరం ఆయా గ్రామాల్లో జరిగిన వేర్వేరు సమావేశాల్లో ఎర్రబల్లి మాట్లాడుతూ.. రాష్ట్రం బాగుపడాలంటే కేసీఆర్‌ మరోసారి సీఎం కావాలన్నారు.   ప్రజలు ఆశీర్వదించి నామినేషన్‌ వేయమంటే వేస్తానని, లేదంటే మానుకుంటానని అన్నారు. ప్రజలు వద్దంటే తాను ఈ ఎన్నికల్లో అసలు పోటీ చేయనని పేర్కొన్నారు.  దేవరుప్పుల మండలంలోని వాగులను నిపుణులతో సర్వే చేయించానని, చెక్‌డ్యాంల నిర్మాణానికి కంకణం కట్టుకున్నానని అన్నారు. డిసెంబరు వరకు పాలకుర్తి, చెన్నూరు, నవాబుపేట, ఉప్పుగల్లు రిజర్వాయర్లు పూర్తి అవుతాయని, ఇక 365 రోజులు నియోజక వర్గంలోని చెరువులు మత్తడి పోయిస్తానని అన్నారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

PREV
click me!

Recommended Stories

Hyderabad లో ఏఐ డేటా సెంటర్.. ఈ ప్రాంతం మరో హైటెక్ సిటీ కావడం ఖాయం
Kavitha Kalvakuntla Pressmeet: రేవంత్ రెడ్డి, హరీష్ రావుపై రెచ్చిపోయిన కవిత| Asianet News Telugu