రేవంత్ రెడ్డి కొండగల్ లోనే గెలవలేదు.. కామారెడ్డిలో విజయం సాధిస్తారా ? - మంత్రి కేటీఆర్

Published : Oct 31, 2023, 04:12 PM IST
రేవంత్ రెడ్డి కొండగల్ లోనే గెలవలేదు.. కామారెడ్డిలో విజయం సాధిస్తారా ? - మంత్రి కేటీఆర్

సారాంశం

కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేయనున్న నేపథ్యంలో ఆ నియోజకవర్గం పరిధిలోని మాచారెడ్డి, రామారెడ్డి మండలాల బీఆర్ఎస్ శ్రేణులతో మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. 

తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. కొడంగల్ లోనే రేవంత్ రెడ్డి ఓడిపోయారని, మరి కామారెడ్డిపై ఎలా గెలుస్తారని ప్రశ్నించారు. కేసీఆర్ పై పోటీ చేయాలనుకుంటున్న ఆయనకు.. నియోజకవర్గ ప్రజలు కనీస డిపాజిట్ కూడా ఇవ్వరని జోస్యం చెప్పారు. సోమవారం రామారెడ్డి, మాచారెడ్డి మండలాలకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలతో ఆయన సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో చేపట్టాల్సిన ప్రచారంపై కార్యకర్తలకు అవగాహన కల్పించారు.

నా ఫోన్ ను ఎంతైనా హ్యాక్ చేసుకోండి.. ఇలాంటి ప్రయత్నాలకు బయపడబోం - రాహుల్ గాంధీ..

అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొడంగల్ లో నరేందర్ రెడ్డిపైనే టీపీసీసీ చీఫ్ గెలవలేదని చెప్పారు. మరి కామారెడ్డి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పై ఎలా గెలుస్తారని ప్రశ్నించారు. ఆయనకు కామారెడ్డి ప్రజలు కనీసం డిపాజిట్ కూడా ఇవ్వరని తెలిపారు. పోడు భూములకు సీఎం కేసీఆర్ పట్టాలు ఇచ్చారని, ఏళ్ల తరబడి నెలకొన్న సమస్యను పరిష్కరించారని చెప్పారు.

మా ఫోన్లు హ్యాక్ చేసేందుకు ట్రై చేస్తున్నారు..ఆపిల్ నుంచి థ్రెట్ నోటిఫికేషన్ వచ్చింది : ప్రతిపక్ష నాయకుల ఆరోపణ

గజ్వేల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన విధంగానే కామారెడ్డి నియోజకవర్గంలో కూడా స్పెషల్ ఆఫీసు ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. అలాగే ఓ స్పెషల్ ఆఫీసర్ ను నియమించి నియోజకవర్గం ప్రజల సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పారు. ఇక్కడ సీఎం గెలిస్తే దశబ్దాలుగా ఉన్న సమస్యలన్నింటికీ పరిష్కారం దొరుకుతుందని తెలిపారు. 

PREV
Read more Articles on
click me!