Bandi Sanjay: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ వేడి పెరుగుతోంది. అన్ని రాజకీయ పార్టీలో ప్రచారంలో దూకుడు పెంచాయి. బీజేపీ కూడా సీట్ల కేటాయింపు ముందే మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Bandi Sanjay: తెలంగాణలో ఎన్నికల దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ వేడెక్కుతోంది. అధికార ప్రతిపక్షాలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ జోరుగా ప్రచారం కొనసాగిస్తోంది. ఈ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. రోజుకు కనీసం రెండు నుంచి మూడు బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. పార్టీ క్యాడేర్ లో ఉత్సాహం నింపుతున్నారు.
ఇక కాంగ్రెస్ పార్టీ కూడా దూకుడుగా వ్యవహరిస్తోంది. పార్టీ అగ్రనేతలను రంగంలో దించింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో బహిరంగ సభలను ఏర్పాటు చేస్తోంది. ఈ క్రమంలోనే నేడు ప్రియాంకగాంధీ తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. భారీ బహిరంగం సభలో ప్రసంగించనున్నారు. ఇక బీజేపీ కూడా ప్రచారంపై ఫోకస్ చేసింది.
undefined
ఈ పార్టీ కూడా ప్రధాని మోడీ తో సహా అగ్రనేతలను రంగంలో దించాలని ప్రయత్నించి.. ఇప్పటికే ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా బహిరంగ సభలను నిర్వహించింది. పూర్తి స్థాయి అభ్యర్థుల ప్రకటన తర్వాత మరింత జోష్ తో ప్రచారం సాగించాలని పార్టీ అగ్రనేతలు, కేంద్ర మంత్రులతో భారీ బహిరంగసభలకు నిర్వహించాలని ప్లాన్ చేస్తుంది.
ఈ తరుణంలో కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కీలక బాధ్యతలు అప్పజెప్పినట్టు సమాచారం. ఆయన సేవలను ఇంకా విస్తృతంగా వాడుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆయనకు బీజేపీ తెలంగాణ స్టార్ క్యాంపెయినర్ హోదా కల్పిస్తూ.. హెలికాప్టర్‌ను కేటాయించినట్టు సమాచారం. బండికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్రేజ్ ను వాడుకోవాలని బీజేపీ అధిష్టానం వ్యూహారచన చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
వాస్తవానికి ఆయన బీజీజే రాష్ట్ర అధ్యక్షుడుగా అటు జీహెచ్‌ఎంసీ.. దుబ్బాక, హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే.. పార్టీ కార్యకర్తల్లోనూ ఆయనకు ఉన్న ఫాలోయింగ్ మామూలు కాదు. ఈ నేపథ్యంలో ఆయనతో రాష్ట్రవ్యాప్తంగా పలు బహిరంగ సభలను నిర్వహించి, పార్టీ క్యాడేర్ లో నూతన ఉత్సహాం నింపాలని, ఈ మేరకే ఆయనకు హెలికాప్టర్ కేటాయించినట్లు తెలుస్తోంది. సంజయ్‌తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్‌తో పాటు మరొకరికి కూడా గాలిమోటర్లు కేటాయించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.