పారిపోయే నువ్వా: కేటీఆర్ కి రేవంత్ రెడ్డి కౌంటర్

By Nagaraju TFirst Published Nov 27, 2018, 4:02 PM IST
Highlights

మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ సహకరించలేదని ధ్వజమెత్తారు. కొడంగల్ లో మీడియా సమావేశంలో పాల్గొన్న రేవంత్ ఓడిపోతే పారిపోయే నువ్వా కొడంగల్ ను దత్తత తీసుకునేది అంటూ ఘాటుగా విమర్శించారు. 

కొడంగల్‌ : మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ సహకరించలేదని ధ్వజమెత్తారు. కొడంగల్ లో మీడియా సమావేశంలో పాల్గొన్న రేవంత్ ఓడిపోతే పారిపోయే నువ్వా కొడంగల్ ను దత్తత తీసుకునేది అంటూ ఘాటుగా విమర్శించారు. కొడంగల్ ను దత్తత తీసుకుని ఏం చేస్తారని ప్రశ్నించారు. కొడంగల్ లో తాను ఉన్నంత వరకు ఇటువైపు ఎవరూ చూసే సాహసం కూడా చేయలేరన్నారు. 

మరోవైపు సీఎం కేసీఆర్ పైనా రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. కేసీఆర్ కు రాజ్యాంగం అంటే గౌరవం లేదని చులకన భావం ఉందని విమర్శించారు. ప్రజలతో చర్చించాకే గతంలో ప్రభుత్వాలను రద్దు చేసేవారని కానీ కేసీఆర్ మాత్రం నిరంకుశంగా తెలంగాణ అసెంబ్లీని రద్దు చేశారని మండిపడ్డారు.  

కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయడానికే ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని విమర్శించారు. కుటుంబసభ్యుల ఆస్తులు పెంచుకోవడం కోసం కేసీఆర్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. కేసీఆర్‌ కుటుంబాన్ని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని తగిన గుణపాఠం చెప్పక తప్పదన్నారు. 

52 నెలల పాలనలో ఉద్యమకారుల ఆకాంక్షలపై కేసీఆర్‌ ఏనాడూ ఆలోచన చేయలేదని రేవంత్‌ ధ్వజమెత్తారు. ప్రస్తుతం టీఆర్ఎస్ కూటమి, ప్రజాఫ్రంట్ ల మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. బీజేపీ, ఎంఐఎం పార్టీలతో టీఆర్ఎస్ వ్యూహాత్మక పొత్తు పెట్టుకుందని ఆరోపించారు.

బుధవారం కోస్గిలో కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ టూర్ ను విజయవంతం చెయ్యాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ రావడం అభివృద్ధికి సూచిక అని రేవంత్‌ స్పష్టం చేశారు. రాహుల్‌గాంధీ సభను విజయవంతం చేయాలని కోరారు. 

మరోవైపు కొడంగల్‌ ప్రాంతాన్ని ఎండబెట్టింది కేసీఆరేనని రేవంత్ మండిపడ్డారు. రైల్వేలైన్‌ దస్త్రాన్ని తొక్కిపెట్టి ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకున్నారని ఆరోపించారు. కొడంగల్‌ కనీస అభివృద్ధికి కూడా సహకరించలేదని ధ్వజమెత్తారు.  
 
కేసీఆర్‌ అవినీతిని బయటపెడుతున్నందుకే తనను అణచివేయాలని చూస్తున్నారని రేవంత్‌ అన్నారు. మన కాంగ్రెస్‌ వస్తే మన ప్రభుత్వం వస్తుందని ఆ‌ ప్రభుత్వంలోనే ఆత్మగౌరవం, సామాజికన్యాయం ఉంటాయని రేవంత్‌ అన్నారు. కేసీఆర్‌ పరిపాలనకు అంతం పలకాల్సిన సమయం ఆసన్నమైందని రేవంత్ పిలుపునిచ్చారు.

 

ఈ వార్తలు కూడా చదవండి

హరీష్ కోరిక కూడా అదే: గుట్టు విప్పిన రేవంత్ రెడ్డి

హరీష్, కేటీఆర్‌లకు మరోసారి రేవంత్ సవాల్: ఈ సారి స్థలం కూడా...

 

click me!