ప్రజాకూటమికి ఓటెస్తే అరాచకమే,టీఆర్ ఎస్ కు ఓటేస్తే సంక్షేమం:కేసీఆర్

By Nagaraju TFirst Published Nov 27, 2018, 3:24 PM IST
Highlights

ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ భారతదేశంలోనే ఏ రాష్ట్రం అమలు చెయ్యలేని సంక్షేమ పథకాలను టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. 
 

మహబూబ్ నగర్: ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ భారతదేశంలోనే ఏ రాష్ట్రం అమలు చెయ్యలేని సంక్షేమ పథకాలను టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. 

ప్రజలు కలలో కూడా ఊహించని పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కంటివెలుగు కార్యక్రమంతో ప్రజలందరి ఆరోగ్యంపై దృష్టి సారించామన్నారు. ఎన్నికల తర్వాత ముక్కు, చెవి గొంతు వంటి వ్యాధులపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఆరోగ్యవంతమైన పాలన అందిస్తామన్నారు. 

తెలంగాణ ఉద్యమం కోసం మంత్రి పదవిని సైతం వదులుకున్న ఏకైక వ్యక్తి జూపల్లి కృష్ణారావు అని మంత్రి కేసీఆర్ కొనియాడారు. కోన్ పూజితే కొల్లాపూర్ అనే వాళ్లు. అలాంటి పరిస్థితి నుంచి చాలా మార్పులు చేశామన్నారు. జిల్లాలో 14 చెరువులు నీటితో నిండికున్నాయని తెలిపారు. కొల్లాపూర్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామన్నారు. పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 

గతంలో తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ఎలా ఉంది ప్రస్తుతం ఎలా ఉందో ప్రజలు గమనించాలని కోరారు. కాంగ్రెస్, టీడీపీలు పాలించిన 58ఏళ్ల పాలన, నాలుగున్నరేళ్ల పాలన మీ కళ్లముందు ఉంది. మీరే ఆలోచించాలని కోరారు. 

ప్రజాఫ్రంట్ కి ఓటేస్తో రాష్ట్రంలో అరాచకం జరుగుతుందని ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మళ్లీ టీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టాలని కేసీఆర్ కోరారు.   

 

ఈ వార్తలు కూడా చదవండి

నేను ఏ పూజ చేసుకుంటే నీకెందుకు: మోడీకి కేసీఆర్ కౌంటర్

click me!