నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 20వేలివ్వాలి: కామారెడ్డిలో రైతులకు రేవంత్ పరామర్శ

By narsimha lodeFirst Published Apr 26, 2023, 4:45 PM IST
Highlights

అకాల వర్షానికి పంట నష్టపోయిన  రైతులను  టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి  ఇవాళ  పరామర్శించారు.  రైతులను ఆదుకోవడంలో  కేసీఆర్ సర్కార్ వైఫల్యం చెందిందన్నారు.  
 

కామారెడ్డి :  అకాల వర్షానికి  పంటనష్టపోయిన  రైతులకు  ఎకరానికి  రూ. 20 వేల పరిహరం చెల్లించాలని  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  డిమాండ్  చేశారు. కామారెడ్డి జిల్లాలోని  పొందుర్తిలో   పంట నష్టపోయిన  రైతులను  రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి  షభ్బీర్ అలీ  పరామర్శించారు. పంట నష్టపోయిన  రైతులను  ఓదార్చారు.రైతులను ఆదుకోవడంలో  ప్రభుత్వం  విపలమైందని  రేవంత్ రెడ్డి  విమర్శించారు. తెలంగాణ వచ్చాక  రైతుల ఆత్మహత్యలు  పెరిగాయని ఆయన ఆరోపించారు. 

 తడిసిన ధాన్యాన్ని తక్షణమే  కొనుగోలు  చేయాలని  ఆయన  డిమాండ్  చేశారు. మామిడి   రైతుకు  రూ. 50 వేల పరిహారం ఇవ్వాలని  రేవంత్ రెడ్డి  ప్రభుత్వాన్ని కోరారు.  ధావత్ ల కోసమే  బీఆర్ఎస్ ఆత్మీయ  సమ్మేళనాలు  నిర్వహిస్తుందని  రేవంత్ రెడ్డి   ఆరోపించారు.

also read:తెలంగాణ రైతును నట్టేట ముంచిన అకాల వర్షం: పంట నష్టంపై అధికారుల సర్వే

మంగళవారంనాడు రాత్రి  తెలంగాణ వ్యాప్తంగా  భారీ వర్షం నమోదైంది.   రాష్ట్రంలోని  27 జిల్లాల్లో   పంట నష్టం వాటిల్లిందని  అధికారులు అభిప్రాయపడుతున్నారు.  పంట నష్టంపై  అధికారులు క్షేత్రస్థాయిలో  సర్వేను  ప్రారంభించారు.   అకాల వర్షంతో  చేతికొచ్చిన పంట దెబ్బతినడంతో  రైతులు  ఆవేదన వ్యక్తం  చేస్తున్నారు. 

click me!