నాా స్థానంలో ఎవరు పోటీచేసినా సరే..: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భావోద్వేగం

By Arun Kumar PFirst Published Apr 26, 2023, 4:42 PM IST
Highlights

తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ప్రస్తుత రాజకీయాలపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 

నిర్మల్ : తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తన అనుచరులు, బిఆర్ఎస్ కార్యకర్తల ముందు భావోద్వేగానికి లోనయ్యారు. వయసు మీదపడుతుండటంతో రాజకీయాలంటే ఇష్టం పోయిందంటూ భవిష్యత్ లో ప్రత్యక్ష రాజకీయాల్లో వుండకూదన్నట్లు మాట్లాడారు మంత్రి. తాను పదవుల కోసం పాకులాడే మనిషిని కాదు... రేప్పొద్దున ఎవరు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్దపడ్డా అభ్యంతరం లేదంటూ ఇంద్రకరణ్ రెడ్డి వ్యాఖ్యానించారు. 

బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్మల్ పట్టణంలో జరిగిన కార్యక్రమంలో ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. దీంతో స్టేజిపై వున్న నాయకులు ఆయనను ఓదార్చి అండగా వుంటామని చెప్పారు.

Latest Videos

మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వ్యాఖ్యలు నిర్మల్ జిల్లా రాజకీయాల్లో చర్చకు దారితీసాయి. ఇటీవల నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే మంత్రి ఇలా మాట్లాడి వుంటారన్న చర్చ జరుగుతోంది.  

వీడియో

ఇదిలావుంటే నిర్మల్ లో బిఆర్ఎస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.  శాస్త్రి నగర్ లోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జెండాను ఆవిష్కరించారు. అనంతరం నిర్మల్ పట్టణంలో పలు వార్డుల్లో కూడా గులాబీ జెండాలను మంత్రి ఆవిష్కరించారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి స్వయంగా బుల్లెట్ బండి నడుపుతూ పట్టణమంతా కలియతిరిగారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. 

 

click me!