మంచు లక్ష్మీ మొదటి భర్త... ఆంధ్రా బిడ్డ... తెలంగాణ ఐటీకే పెద్ద!

First Published May 4, 2017, 9:43 AM IST
Highlights

సీఎం కేసీఆర్ ను ఇరుకనపెట్టేందుకు టీడీపీ నేత రేవంత్ రెడ్డి సినీ నటుడు మోహన్ బాబు కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్నే లేపుతున్నాయి.

ఐటీఐఆర్... ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది కదూ..

Information Technology Investment Region అని దీనర్థం.

యూపీయే  ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ ప్రాజెక్టును హైదరాబాద్ కే కట్టబెట్టింది.

కాంగ్రెస్ హయాంలో నత్తనడకన సాగిన ఈ ప్రాజెక్టు పనులు ఇప్పటికీ నెమ్మదిగానే కొనసాగుతున్నాయి.

అయితే సీఎం కేసీఆర్ ను ఇరుకునపెట్టే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టుపై టీడీపీ నేత రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్ని లేపుతున్నాయి.

నీళ్లు నిధులు నియామకాల కోసం ఉద్యమించి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్న తెలంగాణలో ఇప్పుడు కూడా స్థానికులకు ఉద్యోగాలు దక్కడం లేదని రేవంత్ ఆరోపించారు.

తెలంగాణ ఏర్పాడ్డాక కూడా ఆంధ్రా వాళ్లకే ఇక్కడ ఉద్యోగాలిస్తున్నారని ధ్వజమెత్తారు.

 

హైదరాబాద్ లో ఉన్న ఐటీఐఆర్ ప్రాజెక్టుకు తెలంగాణ వ్యక్తిని  కాదని ఏపీలోని కృష్ణ జిల్లాకు చెందిన శ్రీనివాస్ ను సీఈవో గా నియమించారని మండిపడ్డారు. తెలంగాణ బిడ్డలు విదేశాల్లోనూ ఐటీ రంగంలో సత్తా చాటుతుంటే ఏపీకి చెందిన శ్రీనివాస్ ను ఎందుకు కేసీఆర్ తెలంగాణ ఐటీకే పెద్ద దిక్కుగా ఉన్న ఐటీఐఆర్ కు హెడ్ గా నియమించారని ప్రశ్నించారు.

 

ఇక్కడితో రేవంత్ తన ఆరోపణలు ముగిస్తే అయిపోయేదే కానీ, ఆ శ్రీనివాస్ లండన్ లో చదువుకున్నారని, ఆయన మోహన్ బాబు మొదటి అల్లుడని ( సినీ నటి మంచు లక్ష్మీ మొదటి భర్త) చెప్పేశారు. కేసీఆర్ కు మిత్రుడు కావడం వల్లే ఆంధ్రాకు చెందిన ఆయనకు తెలంగాణ లో పెద్ద ఉద్యోగం  దక్కిందన్నారు.

 

click me!