కాంగ్రెస్‌లో ఇలాంటివి కామన్... రేవంత్ రెడ్డే సర్దుకోవాలి : ‘‘మర్రి’’ వ్యవహారంపై రేణుకా చౌదరి స్పందన

By Siva KodatiFirst Published Aug 18, 2022, 3:09 PM IST
Highlights

కాంగ్రెస్‌లో మర్రి శశిధర్ రెడ్డి వ్యవహారంపై సీనియర్ నేత రేణుకా చౌదరి స్పందించారు. సీనియర్లను అవమానించే శక్తిమాన్ ఎవరూ లేరని రేణుకా చౌదరి పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో ఇలాంటి పరిణామాలు సహజమని కొత్తేం కాదని.. త్వరలోనే అన్ని సెట్ అవుతాయని రేణుకా చౌదరి పేర్కొన్నారు. 

మర్రి శశిధర్ రెడ్డి (marri sasidhar reddy) అంశంపై స్పందించారు మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ (congress) సీనియర్ నేత రేణుకా చౌదరి (renuka chowdhury) . శశిధర్ రెడ్డి మనస్తాపంలో వున్నారని ఆమె అన్నారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డే సర్దుకోవాలని రేణుకా చౌదరి సూచించారు. త్వరలోనే పరిస్ధితి చక్కబడుతుందని... ఖమ్మంలో నన్ను ఎదురించే వాళ్లు లేరని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. అన్ని పార్టీల్లో మనస్పర్ధలు వుంటాయని.. మర్రి శశిధర్ రెడ్డి చాలా కూల్ పర్సన్ అన్నారు. నితిన్ గడ్కరీ లాంటి వాళ్లనే బీజేపీ పక్కన పెట్టిందని..  ఎవరూ లేరని రేణుకా చౌదరి పేర్కొన్నారు. మనుగోడులో కాంగ్రెస్సే గెలుస్తుందని ఆమె జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌లో ఇలాంటి పరిణామాలు సహజమని కొత్తేం కాదని.. త్వరలోనే అన్ని సెట్ అవుతాయని రేణుకా చౌదరి పేర్కొన్నారు. 

ఇకపోతే.. కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి ఏజెంట్‌గా మారారని ఆరోపించారు. రేవంత్ సీనియర్లను గోడకేసి కొడతా అని కామెంట్ చేసినప్పటికీ అధిష్టానం మందలించలేదని అన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ విషయంలో రేవంత్  రెడ్డి తీరు సరికాదని కామెంట్ చేశారు. పార్టీ నడిపిస్తున్నవారే కాంగ్రెస్‌లో కల్లోలానికి కారణమని అన్నారు. అయితే ఇప్పటికే పలువురు నేతలు పార్టీని వీడి వెళ్లడం, పార్టీలో అంతర్గత విభేదాలతో సతమతవుతున్న టీ కాంగ్రెస్‌లో.. మర్రి శశిధర్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు మరింత రచ్చకు దారితీసే అవకాశం ఉంది.

ALso Read:రేవంత్ రెడ్డి ఏజెంట్‌గా మాణిక్కం ఠాగూర్.. : మర్రి శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఇక, తెలంగాణ కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి, అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పినప్పటికీ.. ఆయన మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తనదైన స్టైలిలో అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మరోవైపు మాణిక్కం ఠాగూర్ వ్యవహారశైలిపైనా పార్టీలో అసంతృప్తి గూడుకట్టుకుని ఉంది. సీనియర్ల అభిప్రాయాలు, సలహాలను పట్టించుకోకుండా కేవలం రేవంత్ రెడ్డికి మాత్రమే అనుకూలంగా వుంటున్నారని ఆయనపై కొందరు సీనియర్ నేతలు భగ్గుమంటున్నారు. దాసోజు శ్రవణ్ కూడా వెళ్తూ వెళ్తూ ఇదే రకమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఠాగూర్ తీరుతో చాలామంది నేతలు పార్టీని వీడిపోయే అవకాశాలు ఉన్నాయని.. వెంటనే ఆయన్ని తొలగించాలని అధిష్టానానికి ఫిర్యాదులు సైతం చేస్తున్నారు. ఈ పరిణామాలపై కాంగ్రెస్ అధిష్టానం కూడా దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. 
 

click me!