జడ్చర్ల కాంగ్రెస్‌లో వర్గవిభేదాలు.. ఎర్ర శేఖర్‌పై అనిరుధ్ రెడ్డి సంచలన కామెంట్స్.. మాణిక్కం ఠాగూర్‌‌కు లేఖ

By Sumanth KanukulaFirst Published Aug 18, 2022, 3:00 PM IST
Highlights

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు పార్టీ అదిష్టానానికి తలనొప్పిగా మారుతున్నాయి. ఇప్పటికే పార్టీలో పలువురు నేతల మధ్య పంచాయితీలు కొనసాగుతుండగా.. తాజాగా జడ్చర్ల నియోజకవర్గంలో వర్గవిభేదాలు బయటపడ్డాయి.

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు పార్టీ అదిష్టానానికి తలనొప్పిగా మారుతున్నాయి. ఇప్పటికే పార్టీలో పలువురు నేతల మధ్య పంచాయితీలు కొనసాగుతుండగా.. తాజాగా జడ్చర్ల నియోజకవర్గంలో వర్గవిభేదాలు బయటపడ్డాయి. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ తీరును.. జడ్చర్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ అనిరుద్ రెడ్డిపై తప్పుబట్టారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్‌కు అనిరుధ్ రెడ్డి లేఖ రాశారు. 

ఎర్ర శేఖర్ తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అనిరుధ్ రెడ్డి లేఖలో ప్రస్తావించారు. ఆయన పార్టీలో చేరినప్పుడు ఉన్నట్లుగా ఇప్పుడు ఉండటం లేదని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకోవడాన్ని అనిరుధ్‌ రెడ్డి తొలి నుంచి వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి వ్యక్తిని పార్టీలోకి తీసుకుంటే నష్టం జరుగుతుందని చెప్పినప్పటికీ.. పార్టీలోకి తీసుకున్నారని అన్నారు. అప్పుడు పార్టీ నిర్ణయం కదా అని సర్దుకున్నానని తెలిపారు. హంతకుడి పక్కన నిల్చుంటే ప్రజలు ఏం చేసి ఓటేస్తారనే తాము ఆలోచనలో పడ్డామని చెప్పారు. 

ఇక, టీడీపీకి సంబంధించిన కొందరు తనను కాంగ్రెస్ పార్టీ కోసం పని చేయకుండా అడ్డుకుంటున్నారని అనిరుధ్ రెడ్డి ఆరోపించారు. వారికి తన క్యాడర్ తగిన గుణపాఠం చెబుతుందని హెచ్చరించారు.

click me!