నన్ను కావాలని పక్కకు పెడుతున్నారు : బండి సంజయ్ పై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు..!

Published : Aug 18, 2022, 02:28 PM ISTUpdated : Aug 18, 2022, 03:11 PM IST
నన్ను కావాలని పక్కకు పెడుతున్నారు : బండి సంజయ్ పై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు..!

సారాంశం

బీజేపీ  జాతీయ కార్యవర్గ సభ్యురాలు,సినీ నటి విజయశాంతి పార్టీ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారు. తనకు అవకాశం ఎందుకు ఇవ్వడం లేదో పార్టీ నేతలు  చెప్పాలన్నారు.

హైదరాబాద్:  బీజేపీ నాయకత్వంపై ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి అసంతృప్తిని వ్యక్తం చేశారు. 
గురువారం నాడు హైద్రాబాద్ లో విజయశాంతి  మీడియాతో మాట్లాడారు. ఇవాళ బీజేపీ కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మణ్ ప్రసంగంతో కార్యక్రమం ముగిసింది. పార్టీ కార్యక్రమాల్లో  మాట్లాడే అవకాశం లేకపోవడంతో ఆమె అసంతృప్తిని వ్యక్తం చేశారు.

మాట్లాడడానికి తనకు అవకాశం ఎందుకు ఇవ్వలేదో  పార్టీ నేతలనే అడగాలని ఆమె మీడియా ప్రతినిధులను కోరారు.. తన సేవలను ఎలా ఉపయోగించుకొంటారో బండి సంజయ్, లక్ష్మణ్ లకు తెలియాలన్నారు.తాను  ఎక్కడ నుండి పోటీ చేయాలో పార్టీ అధిస్టానం నిర్ణయిస్తుందని ఆమె చెప్పారు. కరోనా కారంగా పార్టీకి కొద్దికాలం దూరంగా ఉన్నానని ఆయన తెలిపారు.  24 ఏళ్ళు బీజేపీ పార్టీలో పనిచేశానని ఆమె గుర్తు చేశారు. 

పార్టీ తనకు ఏమి బాధ్యత ఇచ్చారని పార్టీలో పనిచేయాలని విజయశాంతి ప్రశ్నించారు. ఒకరిద్దరితో పార్టీలో పనులు జరగవన్నారు.ప్రజల సమస్యల పట్ల అవగాన ఉన్నవాళ్లను ముందులో వరసలో ఉంచాలని ఆమె నాయకత్వాన్ని కోరారు. బాధ్యత కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలనన్నారు. ఇవాళ మీడియా తో మాట్లాడుదామనే వచ్చానని తెలిపారు. పార్టీ తనను ఉపయోగించుకోవడం లేదనే భావిస్తున్నానని విజయశాంతి కుండబద్దలు కొట్టారు. మీకు వచ్చిన అనుమానాలను బండి సంజయ్ ని అడిగితే బాగుంటుందని ఆమె మీడియా ప్రతినిధులకు సూచించారు. పార్టీలో ఏ పదవి ఇచ్చినా స్వీకరిస్తానని చెప్పారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu