శామీర్‌పేట్ కాల్పుల కేసు : డిప్రెషన్ పొగొట్టిన స్మితకు దగ్గరైన మనోజ్.. అడ్డొస్తాడనే సిద్ధార్ధ్‌పై హత్యాయత్నం

హైదరాబాద్ శామీర్‌పేట్ కాల్పుల కేసుకు సంబంధించి పోలీసులు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలను ప్రస్తావించారు. స్మితతో వివాహేతర సంబంధానికి అడ్డొస్తాడనే అక్కసుతోనే సిద్ధార్ధ్‌ను చంపేయాలని మనోజ్ భావించాడని పోలీసులు తెలిపారు.

remand report reveals shocking details in shamirpet firing case ksp

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ శామీర్‌పేట్ కాల్పుల కేసుకు సంబంధించి పోలీసులు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలను ప్రస్తావించారు. 2003లో స్మితతో సిద్ధార్ధ్ దాస్‌కు వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు (ఒక కుమార్తె, ఒక కుమారుడు). ఈ దంపతులు గతంలో హైదరాబాద్ మూసాపేటలో వుండేవారు. ఈ క్రమంలో 2018లో సిద్ధార్ధ్‌పై స్మిత గృహహింస కేసు పెట్టింది. ఆపై కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసింది. నాటి నుంచి భార్యాభర్తలిద్దరూ విడివిడిగా వుంటున్నారు.

మరోవైపు మనోజ్ పలు సినిమాలు, సీరియల్స్‌లో నటించాడు. సరైన అవకాశాలు రాకపోవడంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన స్మితతో డిప్రెషన్ కౌన్సెలింగ్ చేయించుకున్నాడు. అలా వీరిద్దరి పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. స్మిత కొడుకు ఉన్నత చదువుల విషయమై మనోజ్ దురుసుగా ప్రవర్తించాడు. దీంతో ఆ కుర్రాడు చైల్డ్ వెల్ఫేర్ కమీషన్‌కు ఫిర్యాదు చేశాడు. 

Latest Videos

ALso Read:స్మితకు మనోజ్ ఎలా పరిచయమయ్యాడో తెలియదు.. అధికారులు పిలిస్తేనే విల్లాకు వెళ్లా : సిద్ధార్ధ్ కీలక వ్యాఖ్యలు

దీనిపై అందిన సమాచారం ఆధారంగా సిద్ధార్ధ్ హైదరాబాద్ వచ్చాడు. ఈ విషయం ముందే తెలుసుకున్న స్మిత.. మనోజ్‌కు చెప్పింది. దీంతో అతను తన ఎయిర్‌గన్‌ లోడ్ చేసి రెడీగా వున్నాడు. సిద్ధార్ధ్ లోపలికి వస్తుండగా కాల్పులు జరిపాడు. ఊహించని పరిణామంతో భయపడిన సిద్ధార్ధ్ బయటకు పరుగులు తీసి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. స్మితతో తన బంధానికి మనోజ్ అడ్డుగా వుండటంతో అతనిని చంపేయాలని మనోజ్ నిర్ణయించుకున్నాడు. 

అంతకుముందు స్మిత భర్త సిద్ధార్ధ్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు మనోజ్‌కు స్మితతో ఎలా పరిచయం ఏర్పడిందో తనకు తెలియదన్నారు. మనోజ్‌ను తాను ఎప్పుడూ చూడలేదని.. 2018 నుంచి స్మిత తనకు దూరంగా వుంటోందని సిద్ధార్ధ్ చెప్పాడు. 2019లో విడాకుల కోసం స్మిత కోర్టుకు వెళ్లిందని తెలిపాడు. తన పిల్లలు సీడబ్ల్యూసీని ఆశ్రయిస్తే.. అధికారులు తనకు ఫోన్ చేసి పిలిచారని అందుకే శామీర్‌పేట్ వెళ్లినట్లు సిద్ధార్ధ్ వెల్లడించాడు. ఈ క్రమంలోనే మనోజ్ తనపై కాల్పులకు పాల్పడ్డాడని.. తుపాకీ ఎక్కుపెట్టగానే భయం వేసిందని, వెంటనే అక్కడి నుంచి పారిపోయానని పేర్కొన్నాడు. బయటకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశానని సిద్ధార్ధ్ చెప్పాడు. సీడబ్ల్యూసీ అధికారులు తన స్టేట్‌మెంట్ తీసుకున్నారని సిద్ధార్ధ్ వెల్లడించారు. 

vuukle one pixel image
click me!