మొహమూద్ అలీ ఇంట్లో కేసీఆర్‌కు ప్రత్యేక గది... ఆయన వస్తేనే తెరిచేది

By sivanagaprasad KodatiFirst Published Dec 14, 2018, 8:43 AM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెండో సారి ప్రమాణం చేసేటప్పుడు .. తొలుత ఆయన ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో మొహమూద్ అలీకి కూడా తనతో పాటు అవకాశం కల్పించారు కేసీఆర్.

తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెండో సారి ప్రమాణం చేసేటప్పుడు .. తొలుత ఆయన ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో మొహమూద్ అలీకి కూడా తనతో పాటు అవకాశం కల్పించారు కేసీఆర్.

కన్నకొడుకు కేటీఆర్, మేనల్లుడు హరీశ్‌రావులను కూడా కాదని మొహమూద్ అలీకి అంతటి ప్రాముఖ్యతనివ్వడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. వీరిద్దరి అభిమానం ఇప్పటిది కాదు. పార్టీ స్థాపన నుంచి నేటి వరకు మొహమూద్ అలీ.. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు.

సీఎం ఎక్కడ ఉంటే ఆయన అక్కడ ఉండాల్సిందే. కేసీఆర్ ఏదైనా ముఖ్యమైన పని కోసం బయలుదేరితే ‘‘దట్టీ’’ కట్టాల్సిందే. 2001లో కేసీఆర్ టీఆర్ఎస్‌ను స్థాపించినప్పుడు అలీ అందులో చేరారు. అధినేత పర్యటనల్లో పాల్గొన్నారు.

ఉద్యమ సమయంలో తోడుగా నిలిచారు. ఆయన ప్రతిభను గుర్తించిన కేసీఆర్... మొహమూద్ అలీని మైనారిటీ విభాగానికి అధ్యక్షునిగా నియమించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తన తొలి మంత్రివర్గంలో మొహమూద్ అలీకి ఉపముఖ్యమంత్రితో పాటు రెవెన్యూ శాఖ బాధ్యతలు అప్పగించారు.

ఉద్యమ కాలం నాటి నుంచి నేటి వరకు కేసీఆర్ తరచూగా అలీ ఇంటికి వెళ్లేవారు. రంజాన్ ఇతర పర్వదినాలతో పాటు శుభకార్యాలు, పార్టీకి సంబంధించిన ఇతర కీలక అంశాలపై చర్చించాలంటే నేరుగా అజంపురాలోని అలీ ఇంటికి వెళ్తుంటారు.

మొహమూద్ అలీకి కూడా కేసీఆర్ అంటే ఎంతో గౌరవం, అభిమానం. 18 ఏళ్లుగా తమ ఇంట్లో కేసీఆర్ కోసమే ఓ గదిని కేటాయించారు. కుర్చీ, టేబుల్, సోఫా ఇతర ఫర్నిచర్‌ను ఉంచారు. గోడ మీద కేసీఆర్ చిత్రపటం ఉంటుంది. ఆయన వస్తేనే ఈ గదిని తెరుస్తారు. ఇతర సమయాల్లో తాళం వేసి ఉంచుతారు అలీ. 

మహమూద్ అలీకి హోంమంత్రిత్వశాఖను అప్పగించిన కేసీఆర్

ప్రమాణ స్వీకారానికి రండి...మహమూద్ అలీకి రాజ్‌భవన్ పిలుపు, 18న విస్తరణ

తెలంగాణ సిఎంగా కేసీఆర్ ప్రమాణం: ఒక్కరే మహమూద్ అలీ...(వీడియో)

click me!