వరంగల్ ఎనుమాముల మార్కెట్‌లో మిర్చికి రికార్డు ధర: పసిడిని దాటిన మిర్చి రేట్

By narsimha lode  |  First Published Jan 6, 2023, 11:49 AM IST

వరంగల్  ఎనుమాముల మార్కెట్ లో  మిర్చికి   రికార్డు ధర పలికింది.  క్వింటాల్ మిర్చి  రూ. 80, 100 ధర పలికింది. బంగారం కంటే  మిర్చికి  ఎక్కువ ధరకు వ్యాపారులు కొనుగోలు చేశారు. 


వరంగల్ : వరంగల్  ఎనుమాముల మార్కెట్ లో మిర్చికి రికార్డు ధర పలికింది. క్వింటాల్ మిర్చిని  రూ. 80,100 కొనుగోలు చేశారు. దేశవాళీ మిర్చికి  ఇంత రేటుతో  కొనుగోలు చేయడం ఎనుమాముల మార్కెట్ లో  ఇదే తొలిసారి.  ఈ ఏడాది మిర్చి దిగుబడి తగ్గింది.  దీంతో  మిర్చికి డిమాండ్  పెరిగింది.  పచ్చళ్లు, ఔషధాల్లో ఉపయోగించే దేశీ మిర్చిని వ్యాపారులు పోటీలు పడీ కొనుగోలు  చేస్తున్నారు. చపాటా రకం  మిర్చికి   భారీగా  ధర వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. బంగారం కంటే  మిర్చికి అధిక ధర పలుకుతుంది. గతంలో కూడా  ఎనుమాముల మార్కెట్ లో మిర్చికి రికార్డు ధర పలికింది. గత రికార్డులను బద్దలు కొడుతూ  శుక్రవారంనాడు దేశవాళీ మిర్చి క్వింటాలుకు  రూ. 80, 100 ధర పలికింది.  ఖమ్మం జిల్లా  నుండి  ఓ రైతు  నాలుగు బస్తాల మిర్చిని ఎనుమాముల మార్కెట్  యార్డుకు తరలించారు. ఈ మిర్చిని కొనుగోలు చేసేందుకు  పోటీలు పడ్డారు. చివరికి  రూ. 80, 100లకు   వ్యాపారులు ఈ మిర్చిని  కొనుగోలు చేశారు. గతంలో ఇదే మిర్చి రూ. 20 వేలకు పైగా ధర పలికింది.

గతంలో  దేశవాళీ మిర్చి  బస్తాలు  ప్రతి రోజూ వెయ్యి నుండి రెండువేల బస్తాలు వచ్చేవి. కానీ  దిగుబడి  తగ్గిపోవడంతో  దేశవాళీ మిర్చి  కేవలం  ఒకటి రెండు బస్తాలు మాత్రమే వస్తుందని  వ్యాపారులు  చెబుతున్నారు. దేశవాళీ  మిర్చితో పాటు  ఇతర రకాల మిర్చి కి కూడా భారీగా  డిమాండ్  నెలకొంది.

Latest Videos

undefined

గతంలో కూడా  ఇదే మార్కెట్ లో  మిర్చికి భారీ ధర పలికిన సందర్భాలున్నాయి.  2022 సెప్టెంబర్  29న క్వింటాల్ మిర్చికి  రూ. 90వేల ధర పలికింది.గత ఏడాది మార్చి నుండి మిర్చి ధరలు పెరుగుతూనే ఉన్నాయి.  రూ. 50 వేల నుండి మిర్చి  ధరలు పెరుగుతున్నాయి.. గత ఏడాది మార్చిలో  క్వింటాల్ మిర్చికి  రూ. 52 వేల ధర పలికింది. రానున్నది వేసవి కాలం. ఈ సమయంలో  పచ్చళ్లు పెట్టేందుకు  ఎక్కువ మంది ఆసక్తి చూపుతారు . దీంతో  పచ్చళ్ల కారానికి డిమాండ్  పెరగనుంది. దీంతో  దేశవాళీ మిర్చికి  డిమాండ్  పెరిగింది.

also read:పసిడిని దాటిన ధర: వరంగల్ ఎనుమాములలో క్వింటాల్ మిర్చికి రూ. 90 వేలు

దేశవాళీ మిర్చి వరంగల్,  ఖమ్మం  పరిసర ప్రాంతాల్లో  పండిస్తారు.  అయితే ఈ దఫా దిగుబడి  తక్కువగా  ఉంది.  దీంతో   మిర్చికి దిమాండ్  పెరిగింది. దేశవాళీ  మిర్చిని ఉత్తరాధి రాష్ట్రాలకు  చెందిన ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతారు.  అంతేకాదు ఫైవ్ స్టార్ హోటల్స్ లో  కూడా  వినియోగిస్తారు.
 

click me!