బీఆర్ఎస్‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలు: మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్న కాంగ్రెస్

By narsimha lode  |  First Published Jan 6, 2023, 11:10 AM IST

పార్టీ మారిన  12 మంది ఎమ్మెల్యేలపై  కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయనున్నారు.  మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో  కాంగ్రెస్ నేతలు  ఫిర్యాదు చేయనున్నారు. 


హైదరాబాద్:  పార్టీ మారిన  12 మంది ఎమ్మెల్యేలపై  కాంగ్రెస్ పార్టీ నేతలు  శుక్రవారం నాడు  మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నారు.   కాంగ్రెస్  పార్టీ నుండి  12 మంది  ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరారు. ఈ విషయమై   కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయనన్నారు.   2022 అక్టోబర్  26వ తేదీన  నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని   మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు  పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును  సీబీఐ విచారణకు ఆదేశిస్తూ  తెలంగాణ హైకోర్టు  గత ఏడాది డిసెంబర్  26న ఆదేశాలు జారీ చేసింది.  కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో విలీనమైన విషయమై  కూడా పోలీసులకు ఫిర్యాదు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రయోజనం పొందారని కాంగ్రెస్ ఆరోపిస్తుంది.ఈ విషయాన్ని నిరూపించనున్నట్టుగా ఆ పార్టీ నేతలు ప్రకటిస్తున్నారు.  కాంగ్రెస్ ను వీడి  బీఆర్ఎస్ లో  చేరిన  12 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ   ఆ పార్టీ నేతలు  ఇవాళ  మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు.

ఈ విషయమై  ఇప్పటికే న్యాయనిపుణులతో  కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చించారు. న్యాయ నిపుణుల సూచనల మేరకు  మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లోనే  ఫిర్యాదు  చేయాలని కాంగ్రెస్ నేతలు  నిర్ణయించారు.   బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసుతో పాటు  తమ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారిన అంశంపై  కూడా  విచారణ జరపాలని  కాంగ్రెస్ పార్టీ నేతలు  సీబీఐని కోరనున్నారు.ఈ క్రమంలోనే   మొయినాబాద్ పోలీసులకు  ఫిర్యాదు  చేయనున్నారు కాంగ్రెస్ నేతలు.

Latest Videos

also read:బీఆర్ఎస్‌లో చేరిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై విచారణ: సీబీఐని కోరనున్న రేవంత్ రెడ్డి

2014-18 మధ్య కాలంలో కూడా కాంగ్రెస్, టీడీపీ, బీఎస్పీ కి చెందిన ఎమ్మెల్యేలు భీఆర్ఎస్ లో చేరారు.   2018  తర్వాత కూడా కాంగ్రెస్, టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు  బీఆర్ఎస్ లో చేరారు.  అసెంబ్లీలోనే కాదు శాసనమండలిలో కూడా  కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు  బీఆర్ఎస్ లో చేరారు.  టీడీపీ, కాంగ్రెస్ శాసనసభపక్షాలు బీఆర్ఎస్ లో విలీనమయ్యాయి.  ఈ విషయమై  గతంలో  ఈ రెండు పార్టీలకు చెందిన నేతలు  హైకోర్టును కూడా ఆశ్రయించారు.  

 


 

click me!