సిర్పూర్ లో గర్భిణీ కోడలిపై హత్యాయత్నం: ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు

Published : Jan 06, 2023, 10:53 AM IST
సిర్పూర్ లో  గర్భిణీ  కోడలిపై  హత్యాయత్నం: ఆసుపత్రిలో  చికిత్స పొందుతున్న బాధితురాలు

సారాంశం

సిర్పూర్ కాగజ్ నగర్ లో   దారుణం చోటు  చేసుకుంది.  కోడలిపై  అత్తింటివాళ్లు  హత్యాయత్నం  చేశారు. దీంతో  బాధితురాలు  ఆసుపత్రిలో  చేరింది.  ఆమె ఆరోగ్యపరిస్థితి విషమంగా  ఉంది. 

సిర్పూర్  కాగజ్ నగర్: కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో  దారుణం చోటు  చేసుకుంది. గర్భిణీగా  కోడలికి  కూల్ డ్రింకులో పురుగుల మందు కలిపి ఇవ్వడంతో  తీవ్ర అస్వస్థతకు  గురైంది.  బాధితురాలు  శిశువకు  జన్మనిచ్చింది. శిశువు పుట్టిన మరునాడే  మరణించింది.  గర్భిణీ  ఆరోగ్య పరిస్థితి విషమంగా  ఉంది.

జిల్లాలోని సిర్పూర్ కాగజన్ నగర్ కు చెందిన  కవిత , కోట మహేందర్ లు ప్రేమించుకున్నారు.   కవిత  గర్భం దాల్చడంతో  పెద్ద మనుషుల సమక్షంలో పెళ్లి  చేయాలని  నిర్ణయించారు.  దీంతో  గత ఏడాది ఆగస్టు మాసంలో   కవిత, మహేందర్ కు వివాహం జరిపించారు.  ఈ పెళ్లి  మహేందర్ పేరేంట్స్ కు  ఇష్టం లేదు.  దీంతో పెళ్లైన  వారం రోజులకే   ఇంట్లో గొడవలు ప్రారంభమయ్యాయి.  దీంతో కవిత  తన పుట్టింటికి వెళ్లింది. దీంతో కవిత అడ్డు తొలగించుకోవాలనే  అత్తింటి వాళ్లు భావించారు.  పుట్టింట్లో  కవిత  వద్దకు అత్తింటివాళ్లు వెళ్లారు. కూల్ డ్రింక్ లో  పురుగుల మందు కలిపి ఇవ్వడంతో  ఆమె వెంటనే రక్తం వాంతులు చేసుకుంది.ఈ విషయం తెలుసుకున్న  బంధువులు , కుటుంబ సభ్యులు  ామెను ఆసుపత్రిలో  చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ  కవిత  బిడ్డకు జన్మనిచ్చింది.  పుట్టిన మరునాడే  ఆ బిడ్డ  మరణించింది. బాధితురాలి ఆరోగ్యం విషమంగా  ఉందని వైద్యులు  చెబుతున్నారు. తమ కూతురిని చంపేందుకు ప్రయత్నించిన  అత్తింటివాళ్లపై  చర్యలు తీసుకోవాలని   కవిత పేరేంట్స్ కోరుతున్నారని  ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్   ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : మళ్లీ వర్షాలు... ఈసారి ఫిబ్రవరిలో కంటే భారీగా, బిఅలర్ట్
Hyderabad Holi Celebrations 2026 at Tank Bund: హైదరాబాద్‌లో ఘనంగా హోలీ సంబరాలు| Asianet News Telugu