మందుతోపాటు,, మటన్, చికెన్, ఫిష్ లకు కూడా గిరాకీ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా యువత ఎక్కువగా మద్యం కొనుగోలు చేశారు. దుకాణాల్లో ఉన్న మద్యం పూర్తిగా అమ్ముడైపోవడంతో డిపోలు తెరిచి మరి వైన్ షాపులకు మందును సరఫరా చేసినట్లుగా సమాచారం.
హైదరాబాద్ : పండగొచ్చినా, పబ్బం వచ్చినా.. మందు బాబులకు ముందుగా గుర్తుకు వచ్చేది మద్యం బాటిల్లే. ఇక న్యూ ఇయర్ అంటే ఊరుకుంటారా? ఊది పారేశారు.. ఏకంగా మూడు రోజుల్లోనే రూ.658 కోట్ల మద్యం తాగేశారు. తెలంగాణలో పండగల వేళ మద్యం అమ్మకాలు ఊపందుకుంటే సంగతి తెలిసిందే. ఇక న్యూ ఇయర్ అనేసరికి మరింత పెరిగింది. డిసెంబర్ 29, 30, 31 మూడు రోజుల్లో… వందలకోటలో మద్యం అమ్మకాలు జరిగాయి. బీర్లు, వైన్లు, రకరకాల హార్డ్ మద్యం అమ్ముడయ్యింది. ఈసారి డిసెంబర్ 31 ఆదివారం రావడంతో మధ్యాహ్నం నుంచే వైన్స్ షాపు వద్ద విపరీతమైన రద్దీ ఏర్పడింది.
మందుతోపాటు,, మటన్, చికెన్, ఫిష్ లకు కూడా గిరాకీ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా యువత ఎక్కువగా మద్యం కొనుగోలు చేశారు. దుకాణాల్లో ఉన్న మద్యం పూర్తిగా అమ్ముడైపోవడంతో డిపోలు తెరిచి మరి వైన్ షాపులకు మందును సరఫరా చేసినట్లుగా సమాచారం. ఇలా ఏకంగా రూ. 658 కోట్ల మద్యం, బీరు విక్రయాలు జరిగాయని ఆబ్కారి శాఖ అధికారులు తెలిపారు. న్యూ ఇయర్ ఈవెంట్ ను ఏర్పాటు చేసే పబ్బులు, క్లబ్బులు పెద్ద ఎత్తున ముందస్తుగానే మద్యం ఆర్డర్లు ఇచ్చి తెప్పించుకున్నారు.
undefined
Ayodhya Ram Mandir : అందాల రామయ్యకు హైదరబాదీ పాదుకలు ...
అంతేకాదు డిసెంబర్ 31వ తేదీన అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం షాపులను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో విక్రయాలు భారీగా పెరిగాయి. మూడు రోజుల్లో 4.76 లక్షల కేసుల మద్యం, 6.31లక్షల కేసుల బీర్లు అమ్ముడైనట్లుగా తెలుస్తోంది. ఇక డిసెంబర్ 31 రాత్రి ఒంటిగంట వరకు కార్యక్రమాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకత అనుమతిని ఇవ్వడం కూడా ఈ విక్రయాలు పెరగడానికి దోహద పడింది. మందు ఒకటే సరిపోదు కదా.. దాంట్లోకి మంచింగ్ కూడా ఉండాలి. మందులో కలుపుకోవడానికి సోడానో, కూల్ డ్రింకో కావాలి.
అంటే, మద్యం అమ్మకాలతో పాటు వీటి అమ్మకాలు కూడా పెరిగినట్టే కదా. కూల్డ్రింక్స్ అమ్మకాలు కూడా భారీగా పెరిగినట్టుగా చెబుతున్నారు. మటన్, చికెన్, చేపలు మార్కెట్లో దొరకడమే గగనంగా మారిపోయిందట. నాన్ వెజ్ విక్రయాలు రాజధాని హైదరాబాద్లో విపరీతంగా జరిగాయి. మామూలు రోజుల్లో రోజుకు మూడు లక్షల కిలోల చికెన్ విక్రయాలు జరుగుతుండగా.. డిసెంబర్ 31 ఆదివారం రావడంతో 4.5 లక్షల కిలోల చికెన్ అమ్ముడైందట. దాదాపుగా సగానికి ఎక్కువ శాతం అమ్మకాలు పెరిగాయి. డిమాండ్ పెరిగిన చికెన్ ధరలో మాత్రం ఏమాత్రం మార్పు రాలేదు.