హైద్రాబాద్‌లో కారులో మృతదేహం: రియల్‌ వ్యాపారి విజయ భాస్కర్ రెడ్డిగా గుర్తింపు

By narsimha lodeFirst Published Nov 30, 2021, 10:32 AM IST
Highlights


సికింద్రాబాద్ తిరుమల గిరిలో కారులో రియల్ ఏస్టేట్ వ్యాపారి విజయభాస్కర్ రెడ్డి హత్యకు గురయ్యాడు.  ఈ హత్యకు సంబంధించి పోలీసులు  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు

హైదరాబాద్: సికింద్రాబాద్ తిరుమలగిరిలో కారులో డెడ్‌బాడీ కలకలం రేపింది. మృతుడిని రియల్‌ఏస్టేట్ వ్యాపారి విజయభాస్కర్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు.  సోమవారం నాడు ఉదయం 10 గంటలకు ఇంటి నుండి వెళ్లిన విజయభాస్కర్ రెడ్డి తిరిగి రాలేదు. కారులోనే ఆయన శవమై తేలడం ప్రస్తుతం కలకలం రేపుతోంది.  ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం Vijay Bhaskar Reddy నిన్న ఉదయం ఇంటి నుండి రూ. 10 లక్షలతీసుకెళ్లినట్టుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 

 

ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని police అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మరో వైపు ప్లాట్ రిజిస్ట్రేషన్ విషయమై  మధ్యవర్తులుగా వ్యవహరించిన వారే ఈ దారుణానికి పాల్పడ్డారా లేక మరేవరైనా  ఈ ఘటనకు పాల్పడ్డారా అనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.కారులోనే రియల్టర్ విజయ భాస్కర్ రెడ్డిని కత్తితో పొడిచి చంపినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సోమవారం నాడు ఉదయం 11 గంటలకే విజయభాస్కర్ రెడ్డి హత్యకు గురయ్యారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. 

also read:కారులో డెడ్‌బాడీ కేసు: కోరాడ విజయ్‌కుమార్ విజయవాడ పోలీసులకు లొంగుబాటు

మృతదేహన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీం సహాయంతో మరణించిన వ్యక్తి నుండి ఆధారాలు సేకరించారు. నోరు ముక్కు వద్ద గాయాలు కావడం, చెవి వెనుక భాగం నుండి రక్తస్రావం జరుగుతుండడంతో పోలీసులు తొలుత అనుమానాస్పద మృతిగా గుర్తించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆ తర్వాత హత్యగా గుర్తించారు. విజయ భాస్కర్‌కు గత కొద్దిరోజులుగా ఆస్తి విషయంలో తన బంధువులతో గొడవలు జరుగుతున్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలియజేశారు.విజయ భాస్కర్ రెడ్డి హత్య కేసులో కుటుంబ సభ్యులు కొందరిపై అనుమానాలు వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేసిన వారిని కూడా పోలీసులు  విచారించే అవకాశం ఉంది. ఈ హత్యకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని మృతుల కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

గతంలో కూడా హత్య చేసిన car లోనే మృతదేహాలను వదిలి వెళ్లిన ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకొన్నాయి.ప్రధానంగా ఆర్ధిక లావాదేవీలతో పాటు వివాహేతర సంబంధాలతోనే ఈ తరహా ఘటనలు చోటు చేసుకొంటున్నాయి. గతంలో మెదక్ జిల్లాలో కూడా రియల్ ఏస్టేట్ వ్యాపారిని హత్య చేసి కారులోనే డెడ్ బాడీని వదిలి వెళ్లిన ఘటన కలకలం రేపింది.కారులోనే రియల్టర్ శ్రీనివాస్ ను హత్య చేశారు. వెల్తుర్ది శ్రీనివాస్ గా  పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్ ను ఈ ఏడాది ఆగష్టు 10వ తేదీన ఈ ఘటన చోటు చేసుకొంది.కారులోనే రియల్టర్ శ్రీనివాస్ ను హత్య చేశారు.  శ్రీనివాస్ గా  పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్ ను ఈ ఏడాది ఆగష్టు 10వ తేదీన ఈ ఘటన చోటు చేసుకొంది. హత్యకు గురైన వ్యక్తిని రియల్ ఏస్టేట్ వ్యాపారి ధర్మకారి శ్రీనివాస్ గా గుర్తించారు. హైద్రాబాద్ నుండి కామారెడ్డికి తిరిగి వెళ్తున్న సమయంలోనే శ్రీనివాస్  హత్యకు గురయ్యాడు. 

click me!