ఆదిలాబాద్‌లో రియల్ వ్యాపారి దారుణహత్య: సొంత సోదరులే హంతకులు

Published : Dec 16, 2019, 08:58 PM ISTUpdated : Dec 16, 2019, 09:16 PM IST
ఆదిలాబాద్‌లో రియల్ వ్యాపారి దారుణహత్య: సొంత సోదరులే హంతకులు

సారాంశం

ఆదిలాబాద్‌లో పట్టపగలు నడిరోడ్డుపై దారుణహత్య జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో జరిగిన గొడవలే ఈ హత్యకు కారణమైవుంటాయని పోలీసులు భావిస్తున్నారు. 

ఆదిలాబాద్‌లో పట్టపగలు నడిరోడ్డుపై దారుణహత్య జరిగింది. వివరాల్లోకి వెళితే... బేలకు చెందిన ఆమూల్ కొమ్మవార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని బస్టాండ్‌ ముందు ఉన్న పాత జాతీయ రహదారిపై నిల్చొన్న ఆయనను సోదరులు దిలీప్ ఠాకూర్, గోపాల్ ఠాకూర్ కత్తితో పొడిచారు.

సమాచారం అందుకున్న పోలీసులు అమూల్‌ను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఆయనను పరిశీలించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు తెలిపారు.

Also read:సమతపై గ్యాంగ్ రేప్: నిందితుల తరపున వాదించేందుకు ముందుకురాని లాయర్లు

అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో జరిగిన గొడవలే ఈ హత్యకు కారణమైవుంటాయని పోలీసులు భావిస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే అందరూ చూస్తుండగానే ఈ హత్య జరగడంతో జనం భయభ్రాంతులకు గురయ్యారు.

సమతపై గ్యాంగ్ రేప్ కేసులో  నిందితులను పోలీసులు సోమవారం నాడు కోర్టులో హాజరుపర్చారు. జ్యూడీషీయల్ కస్టడీకి నిందితులను రేపు హాజరుపర్చే అవకాశం ఉంది.

గత నెల 24వ తేదీన గోసంపల్లిలో సమతపై ముగ్గురు నిందితులపై పోలీసులు  గ్యాంగ్‌రేప్‌కు పాల్పడి, హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు సోమవారం నాడు నిందితులను కోర్టులో హాజరుపర్చారు.

Also Read:దిశ నిందితుల ఎన్‌కౌంటర్: సుప్రీంలో మరో పిటిషన్

నిందితుల తరపున వాదించేందుకు లాయర్లు ఎవరూ కూడ ముందుకు రాలేదు. ఈ కేసుకు సంబంధించిన ఛార్జీషీట్ ను ఈ నెల 14వ తేదీన ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో పోలీసులు దాఖలు చేశారు. కేసు విచారణను  కోర్టు రేపటికి వాయిదా వేశారు.నిందితులను జ్యూడీషీయల్ రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది.


 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ