మందుబాబులకు షాక్: మద్యం రేట్లు పెంచిన తెలంగాణ సర్కార్

By Siva KodatiFirst Published Dec 16, 2019, 8:32 PM IST
Highlights

మందుబాబులకు చేదువార్త.. రాష్ట్రంలో మద్యం ధరలు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అన్ని రకాల మద్యం ధరలను 10 శాతం పెంచుతున్నట్లు సర్కార్ స్పష్టం చేసింది

మందుబాబులకు చేదువార్త.. రాష్ట్రంలో మద్యం ధరలు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అన్ని రకాల మద్యం ధరలను 10 శాతం పెంచుతున్నట్లు సర్కార్ స్పష్టం చేసింది. బాటిల్ సామర్ధ్యాన్ని బట్టి మద్యంపై రూ.20 నుంచి రూ.80, బీరుపై రూ.10 నుంచి రూ.20 వరకు పెంచుతున్నట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది.

Also Read:జగన్ తో ఆరా: తెలంగాణ మద్యం విధానం వెనుక కేసీఆర్ స్కెచ్ ఇదీ...

పెరిగిన ధరలు ఎల్లుండి నుంచి పెరిగిన ధరలు అందుబాటులోకి రానున్నాయి. పాత నిల్వలకు ధరల పెంపు వర్తించదని అబ్కారీ శాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్ కుమార్ వెల్లడించారు. మద్యం ధరల పెంపుతో రాష్ట్ర ఖజానాకి రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరనుంది. 

Also Read:నూతన మద్యం పాలసీ... జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

నవంబర్ 1 నుంచి తెలంగాణలో నూతన మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది. తొలుత జగన్ సర్కార్ అవలంబించిన విధానాన్నే ఫాలో అవ్వాలని కెసిఆర్ కూడా భావించారు.  ఈ మద్యం విధానాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఎలా అమలు చేయబోతున్నారో జగన్ ను అడిగి కెసిఆర్ తెలుసుకున్నారు. మొన్నటి భేటీలో కెసిఆర్ కు జగన్ తమ ప్రభుత్వం ఏ విధంగా ఈ నూతన మద్యం విధానాన్ని నిర్వహించబోతుందో సవివరంగా వివరించారు.

click me!