దిశ నిందితుల ఎన్‌కౌంటర్: సుప్రీంలో మరో పిటిషన్

By narsimha lodeFirst Published Dec 16, 2019, 6:14 PM IST
Highlights

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ సామాజిక కార్యకర్త సజయ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

న్యూఢిల్లీ: దిశ నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని  కోరుతూ సామాజిక కార్యకర్త కె. సజయ సోమవారం నాడు  సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

గత నెల 27వ తేదీన తెలంగాణలోని శంషాబాద్ సమీపంలోని తొండుపల్లి సర్వీస్ రోడ్డు వద్ద దిశపై నలుగురు నిందితులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడి హత్య చేశారు. ఈ నెల 6వ తేదీన  చటాన్‌పల్లి సమీపంలో నిందితుల‌ను ఎన్‌కౌంటర్ చేశారు. 

ఈ ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ  సామాజిక కార్యకర్త  సజయ సోమవారం నాడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ శరద్‌ అరవింద్‌ బాబ్డే సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ ముందు ప్రస్తావించాలని సూచించారు. 

click me!