బీఆర్ఎస్‌కు షాక్: కాంగ్రెస్‌లో చేరిన రంజిత్ రెడ్డి, దానం నాగేందర్

By narsimha lodeFirst Published Mar 17, 2024, 2:14 PM IST
Highlights

బీఆర్ఎస్ కు ఆ పార్టీకి చెందిన ఇద్దరు ప్రజా ప్రతినిధులు షాకిచ్చారు. ఈ ఇద్దరు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

హైదరాబాద్: చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి,  ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ లు ఆదివారంనాడు కాంగ్రెస్ పార్టీలో చేరారు.  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ దీపాదాస్ మున్షీ సమక్షంలో  వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.

also read:విచారణకు రావాలి: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు

చేవేళ్ల పార్లమెంట్ స్థానం నుండి  గత ఎన్నికల్లో రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్ధిగా విజయం సాధించారు. అయితే  చేవేళ్ల పార్లమెంట్ స్థానం నుండి తొలుత రంజిత్ రెడ్డి పేరును ఖరారు చేశారు.ఆ తర్వాత  చేవేళ్ల నుండి పోటీకి  రంజిత్ రెడ్డి ఆసక్తిని చూపలేదు. దరిమిలా చేవేళ్ల నుండి రంజిత్ రెడ్డి స్థానంలో కాసాని 
జ్ఞానేశ్వర్ కు బీఆర్ఎస్ టిక్కెట్టు కేటాయించింది. బీఆర్ఎస్ కు  చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి  ఆదివారం నాడు రాజీనామా చేశారు.

 

ముఖ్యమంత్రి, టిపిసిసి అద్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన చేవెళ్ల బీఆరెస్ ఎంపీ రంజిత్ రెడ్డి గారు, ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు. pic.twitter.com/4hPJhvYT0k

— Telangana Congress (@INCTelangana)

also read:పిచ్ మార్చారు: ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్ ఓటమిపై కైఫ్ ఆరోపణలు

బీఆర్ఎస్ రాజీనామా చేసిన  కొన్ని గంటల్లోనే  కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరారు.ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడ  ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఇటీవలనే  దానం నాగేందర్  సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత  దానం నాగేందర్ పార్టీ మారుతారని  ప్రచారం సాగుతుంది.ఈ ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు.

also read:కూరగాయల తరహలోనే నూడుల్స్ విక్రయం: సోషల్ మీడియాలో వైరలైన వీడియో

కానీ, ఇవాళ  దానం నాగేందర్ దీపాదాస్ మున్షీ సమక్షంలో  కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుండి దానం నాగేందర్ ను కాంగ్రెస్ పార్టీ  బరిలోకి దింపే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది.

 

click me!