37 కార్పోరేషన్ చైర్ పర్సన్ పదవుల భర్తీ: ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ సర్కార్

By narsimha lode  |  First Published Mar 17, 2024, 8:56 AM IST

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నామినేటేడ్ పదవుల భర్తీని ప్రారంభించింది.  
 



హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని  37 కార్పోరేషన్లకు  ప్రభుత్వం  చైర్మెన్లను నియమించింది. ఈ నెల  14నే  కార్పోరేషన్లకు చైర్మెన్లను నియమిస్తూ  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని  సమాచారం.  

గత ఏడాది నవంబర్  30న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి పోలింగ్ జరిగింది.ఈ పోలింగ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో  కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం  ఇంతకాలం పనిచేసిన ఆ పార్టీ నేతలకు  కార్పోరేషన్ చైర్ పర్సన్ పదవులను కట్టబెట్టారు.  ఇంకా మరికొందరికి కూడ పదవులు దక్కనున్నాయి. 

Latest Videos

కార్పోరేషన్ చైర్మెన్ పదవులు దక్కింది వీరికే


1.నూతి శ్రీకాంత్ (బీసీ ఆర్ధిక సంస్థ)
2.శివసేనా రెడ్డి (తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ)
3.గుర్నాథరెడ్డి(పోలీస్ గృహ నిర్మాణ సంస్థ)
4.పటేల్ రమేష్ రెడ్డి( టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్)
5.రాయల నాగేశ్వరరావు (గిడ్డంగుల సంస్థ)
6.నేరేళ్ల శారద( మహిళా కమిషన్)
7.ఎన్. ప్రీతమ్ ( ఎస్ సీ కార్పోరేషన్)
8.బెల్లయ్య నాయక్( గిరిజన సహకార ఆర్దిక సంస్థ)
9.రియాజ్ (గ్రంధాలయ పరిషత్)
10.మెట్టు సాయికుమార్(మత్స్య సహకార సంఘాల సమాఖ్య)
11.జగదీశ్వరరావు( ఇరిగేషన్ డెవలప్ మెంట్)
12. జంగా రాఘవరెడ్డి( ఆయిల్ ఫెడ్)
13.అనిల్ (మైనింగ్ కార్పోరేషన్)
14. జ్ఞానేశ్వర్ (విజయా డెయిరీ)
15. ఎం.విజయబాబు ( రాష్ట్ర సహకార గృహ నిర్మాణ సమాఖ్య)
16. బండ్రు శోభారాణి( మహిళా సహకార అభివృద్ది సంస్థ)
17.నిర్మల (పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ)
18.ఎం. మోహన్ రెడ్డి( రాష్ట్ర సహకార యూనియన్)
19. ఎస్. అన్వేష్ రెడ్డి( విత్తనాభివృద్ది సంస్థ)
20.కాసుల బాలరాజు ( ఆగ్రోస్ సంస్థ)
21.జనక్ ప్రసాద్( కనీస వేతన సలహా మండలి)
22. ఎం. వీరయ్య (వికలాంగుల సంస్థ)
23.మల్‌రెడ్డి రాంరెడ్డి ( రోడ్డు అభివృద్ది సంస్థ)
24.పి. వీరయ్య( అటవీ అభివృద్ది సంస్థ)
25.చల్లా నరసింహారెడ్డి (అర్బన్ ఫైనాన్స్ మౌలిక సదుపాయాల అభివృద్ది సంస్థ)
26.ఎన్. సత్యనారాయణ ( హస్తకళల సంస్థ)
27.ఎం.ఎ. జబ్బార్ (మైనార్టీ ఆర్ధిక సంస్థ)
28.కాల్వ సుజాత (వైశ్య సంస్థ)
29.కె.నాగు (గిరిజన సహకార, ఆర్ధిక ఆర్ధికాభివృద్ది సంస్థ)
30.ఎ. ప్రకాష్ రెడ్డి (రాష్ట్ర ట్రేడింగ్ ప్రమోషన్ కార్పోరేషన్)
31.జైపాల్ (అత్యంత వెనుకబడిన వర్గాల అభివృద్ది సంస్థ)
32.ఎన్. గిరిధర్ రెడ్డి (ఫిలిం డెవలప్ మెంట్ సంస్థ)
33. ఎం.ఎ. ఫహీం(తెలంగాణ ఫుడ్స్)
34. మన్నె సతీష్ ( రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ అభివృద్ది సంస్థ)
35.పి. అలేఖ్య (సంగీత నాటక అకాడమీ)
36.కె. నరేందర్ రెడ్డి (శాతవాహన అర్భన్ అభివృద్ది సంస్థ)
37.వెంకట్రాంరెడ్డి( కాకతీయ అర్బన్ అభివృద్ది సంస్థ)

గత ఏడాది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  కార్పోరేషన్ చైర్ పర్సన్ పదవుల్లో  బీఆర్ఎస్ నేతలు తమ పదవులకు రాజీనామాలు చేశారు. దరిమిలా ఈ కార్పోరేషన్లకు  కాంగ్రెస్ సర్కార్ కొత్తవారిని  నియమించింది.

click me!