మంత్రి పట్నం మహేందర్ కు రేవంత్ ఉల్టా షాక్

Published : Oct 30, 2017, 11:33 AM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
మంత్రి పట్నం మహేందర్ కు రేవంత్ ఉల్టా షాక్

సారాంశం

పట్నం కంచుకోటను కొల్లగొట్టిన రేవంత్ జడ్పీటీసీలు, ఎంపిటీసీలను తనవైపు తిప్పుకున్ రేవంత్ రంగారెడ్డి జిల్లాలో పట్నం ఫ్యామిలీకి ఊహించని షాక్

రాజకీయాల్లో వ్యూహ ప్రతి వ్యూహాలు మస్త్ గమ్మత్తుగా ఉంటాయి. అయితే ప్రతి సందర్భంలోనూ ప్రతిపక్ష పార్టీల మీదే అధికార పార్టీ వారిది పైచేయి అవుతుంది. దీనికి కారణాలు అనేకం. వారికి ఉన్న అధికార బలం అందులో ముఖ్యమైనది. దీంతో ఇటీవల కాలంలో ప్రతిపక్షాలను బలహీనం చేసేందుకు అధికార పక్షం వారు ఫిరాయింపులను ప్రోత్సహించడం మామూలే.

కానీ ప్రతిపక్షాల వారు ఫిరాయింపులను ప్రోత్సహించడం అంత ఈజీ కాదు. అది కూడా అధికార పార్టీ నుంచి నాయకులను తమవైపు రప్పించుకోవడం పెద్ద సాహసమే. ఎందుకంటే అధికార పార్టీని వీడి ప్రతిపక్షం వైపు వచ్చేందుకు ఎవరూ సాహసం చేయరు. మరి అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు రేవంత్ రెడ్డి.

రంగారెడ్డి జిల్లా అంటేనే పట్నం మహేందర్ రెడ్డికి కంచుకోట లాంటిది. అందుకే పట్న మహేందర్ రెడ్డి టిడిపిలో ఉన్నా, టిఆర్ఎస్ లో ఉన్నా జిల్లాలో అనేక పదువులు ఆయన కుటుంబం వారికే ఉంటాయి. అయినా జిల్లాలో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తారు పట్నం ఫ్యామిలీ వారు. కానీ తాజాగా ఆయన అనుచరులు పలువురు రేవంత్ గూటికి చేరి పట్నం మహేందర్ రెడ్డికి షాక్ ఇచ్చారు.

రేవంత్ రెడ్డి శిబిరంలో చేరిన వారిలో పలువురు జడ్పీటిసిలు, ఎంపిటిసిలు ఉన్నారు. నలుగురు జెడ్పీటీసిలు, 12 మంది ఎంసిటిసిలు రేవంత్ తో సహా కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. వారి జాబితా కింద చూడొచ్చు.

గతంలో తెలంగాణ ఉద్యమం బలంగా ఉన్న సమయంలో ప్రతిపక్ష టిడిపి సభ్యులను పెద్ద సంఖ్యలో టిఆర్ఎస్ పార్టీ తమ వైపు తిప్పుకుంది. అరకొర కాంగ్రెస్ నేతలను సైతం టిఆర్ఎస్ ఆకర్షించింది. అయితే అప్పట్లో ప్రతిపక్ష టిడిపి నుంచి టిఆర్ఎస్ లో వెళ్లడం అంటే పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు. కానీ అప్పట్లో అధికార కాంగ్రెస్ నుంచి వలసలు టిఆర్ఎస్ వైపు వెళ్లడం మాత్రం పెద్ద దుమారం రేపింది.

గత వారం రోజులుగా రేవంత్ రెడ్డి మీద టిఆర్ఎస్ పార్టీ అన్ని వైపులా గురి పెట్టింది. అనేక మంది మంత్రులు రేవంత్ ను బలహీనపరిచేందుకు రంగంలోకి దిగిర్రు. అందులో మంత్రి పట్నం మహేందర్ రెడ్డి తీవ్రమైన ప్రతయ్నమే చేశారు. ఆయన కష్టపడి ఇటీవల కొందరు రేవంత్ అనుచరులను టిఆర్ఎస్ పార్టీలో చేర్పించుకున్నారు. కానీ 24 గంట్లల్లోనే వారంతా తిరిగి రేవంత్ శిబిరంలో చేరిపోయారు. ఇంతపనికి ఉన్నవా అని రేవంత్ తాజాగా పట్నం అనుచరులను తనవైపు తిప్పుకోవడం సంచలనంగా మారింది. గతంలో రేవంత్ కు పట్నం షాక్ ఇవ్వబోతున్నట్లు ఏషియానెట్ రాసిన కథనం తాలూకూ ఫొటో ఇక్కడ కింద చూడొచ్చు.

గతంలో టిఆర్ఎస్  తరహాలో నేడు రేవంత్ రెడ్డి కూడా ప్రయత్నాలు ముమ్మరం చేసిన వాతావరణం ఉంది. అధికార పక్షం వారిని గుంజుడు షురూ చేసిండు. మరి ఈ పరంపర ఇక్కడితో బ్రేక్ పడుతుందా కంటిన్యూ అవుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రౌడీషీటర్ ను లైవ్ లో మర్డర్ చేశారు. ఆ వీడియో కోసం 

https://goo.gl/oS3BpF

 

PREV
click me!

Recommended Stories

Christmas Holidays : ఓరోజు ముందుగానే క్రిస్మస్ సెలవులు.. ఎప్పటివరకో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!
Uttam Kumar Reddy Pressmeet: కేసీఆర్ వ్యాఖ్యలనుతిప్పి కొట్టిన ఉత్తమ్ కుమార్ | Asianet News Telugu