
తన రాజీనామాతో సహా అనేక అంశాలపై రేవంత్ రెడ్డి స్పందించారు. ఆయన మాటల్లోనే చదవండి..
వరుసగా రెండుసార్లు తనను శాసన సభకు పంపిన కోడంగల్ నియోజకవర్గ ప్రజలు నా గుండెళ్లో ఉంటారు.
జడ్చర్ల, కొల్లాపూర్, తాండూర్ ల నుంచి పోటీ చేస్తారని కొందరు తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారు.
కాని కోడంగల్ మినహా నేనెక్కడా పోటీ చేయను. కోడంగల్ లో నేను రాకముందు పేదోడు చెప్పులు వేసుకుని తిరగలేని పరిస్థితి ఉండేది.
రాజకీయంగా నేను ఏ నిర్ణయం తీసుకున్నా అది కోడంగల్ నియోజకవర్గ ప్రజలకు మేలు జరిగేలా తీసుకున్నా.
తెలంగాణాలో దొరల పాలన కొనసాగుతుంది.. దొరల పాలన అంతం చేసేందుకే నా పోరాటం. సాగిస్తా.
కేసీఆర్ కుటుంబంలోని నలుగురి పాలన అంతం కోసమే రాజీనామా నిర్ణయం తీసుకున్న. కేసిఆర్ కుటంబ పాలన అంతం చేసే వరకు విశ్రమించను.
నా అధిష్టానం కోడంగల్ నియోజకవర్గ ప్రజలే. రాష్టరాజకీయాలను కేసీఆర్ దోపిడిని అరకట్టేందుకే పోరాటం చేస్తాను.
అసలైన ఆట ఇప్పుడే మొదలైంది.. రేపు 9 గంటలకు జలవిహార్ లో బహిరంగ సభ... ఆ సభ తర్వాత నా నిర్ణయం ప్రకటిస్తా.
రేపటి నిర్ణయం కేసీఆర్ కుటుంబ పాలన, కేసీఆర్ కభంద హస్తాల విముక్తికి నాంది అవుతుంది. కేసీఆర్ వ్యతిరేక శక్తులంతా రేపటి సభకు తరలిరావాలి.
రేవంత్ రెడ్డి (నేను) రాజకీయాల్లో ఉన్నంత వరకు కోడంగల్ నుంచే పోటీ చేస్తాడు. నేను చచ్చినా నా సమాధి ఇక్కడే ఉంటుంది.
కోడంగల్ దొరల కోటలను కూల్చినట్టే కేసీఆర్ కోటలను కూల్చేస్తాను.
అధికారపార్టి నేతలు తమ కార్యకర్తలను పార్టీలో చేర్చుకునేందుకు డబ్బుల మూటలు పట్టుకుని తిరుగుతున్నారు.
కొందరు సన్నాసులు పార్టి మారినా నిజమైన కార్యకర్తలు నావెంటే ఉంటారు.