రంగారెడ్డి ఇబ్రహీంపట్టణం డబుల్ మర్డర్ కేసు: ముగ్గురికి జీవిత ఖైదు

By narsimha lode  |  First Published Oct 19, 2023, 2:18 PM IST

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో  ఇద్దరు రియల్టర్లను హత్యచేసిన  కేసులో  ముగ్గురు నిందితులకు రంగారెడ్డి జిల్లా కోర్టు  జీవిత ఖైదును విధించింది.


హైదరాబాద్:   రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం డబుల్ మర్డర్ కేసులో  నిందితులకు  రంగారెడ్డి జిల్లా కోర్టు  జీవిత ఖైదును విధించింది. ఈ కేసుకు సంబంధించి  గురువారంనాడు రంగారెడ్డి  జిల్లా కోర్టు  తీర్పు వెల్లడించింది.మట్టారెడ్డి,  బిక్షపతి,ఖాజా మొయినొద్దిన్ కు  రంగారెడ్డి కోర్టు  జీవిత ఖైదు విధించింది.

2022 మార్చి 21న  రియల్టర్లు  శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలను   మట్టారెడ్డి, ఖాజా మొయినొద్దిన్, బిక్షపతిలు  హత్య చేశారు. శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలను హత్య చేసేందుకు  ఖాజా మెయినొద్దిన్, బిక్షపతిలకు  మట్టారెడ్డి సుఫారీ ఇచ్చాడని  పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. ఈ మేరకు కోర్టులో ఆధారాలను సమర్పించారు. 

Latest Videos

ఇబ్రహీంపట్టణం పోలీస్ స్టేషన్  పరిధిలోని కర్ణంగూడలో  శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలు హత్యకు గురయ్యారు.కర్ణంగూడలోని లేక్ విల్లా ఆర్చిడ్స్ లో నెలకొన్న భూ వివాదం  ఈ హత్యలకు కారణమైంది. దీంతో శ్రీనివాస్ రెడ్డి,  రాఘవేందర్ రెడ్డిలను  హత్య చేయాలని   సుఫారీ ఇచ్చి హత్య చేయాలని మట్టారెడ్డి ప్లాన్ చేశారు. వివాదంలో ఉన్న భూమి వద్దకు వచ్చిన  శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలపై కాల్పులకు దిగి హత్య చేశారు నిందితులు. ఈ కేసులో ముగ్గురిని దోషులుగా  తేల్చింది రంగారెడ్డి కోర్టు.  ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ గురువారం నాడు జీవిత ఖైదు విధించింది రంగారెడ్డి కోర్టు.ఈ కేసులో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇబ్రహీంపట్టణం ఏసీపీపై పోలీస్ శాఖ  విధుల నుండి తప్పించింది. 
 

click me!