లిక్కర్ క్వీన్.. బతుకమ్మపై గౌరమ్మను కాదు మందు బాటిల్ పెడతావేమో.. : కవితపై జీవన్ రెడ్డి ఫైర్ (వీడియో)

By Arun Kumar P  |  First Published Oct 19, 2023, 1:22 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బిఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.  తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్పీ జీవన్ రెడ్డి సీఎం కేసీఆర్ కూతురుపై సంచలన వ్యాాఖ్యలు చేసారు.  


జగిత్యాల : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విరుచుకుపడ్డారు. చరిత్రలో ఎలిజబెత్ క్వీన్ వున్నట్లు ఇప్పుడు తెలంగాణలో లిక్కర్ క్వీన్ వుందంటూ కవితపై తీవ్రవ్యాఖ్యలు చేసారు. ఎలిజబెత్ క్వీన్ ను మరిపించేలా కవిత వ్యవహారశైలి వుందన్నారు. కొంపదీసి మరోసారి బిఆర్ఎస్ పార్టీకి అధికారం వచ్చిందంటే ఎంతో పవిత్రమైన బతుకమ్మపై గౌరమ్మను కాకుండా లిక్కర్ బాటిల్ పెడతారని అన్నారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీని ఎలక్షన్ గాంధీ అని... ఆయన టూరిస్ట్ లా వచ్చి అంకాపూర్ చికెన్ రుచిచూసి  వెళితే బావుంటుందంటూ కవిత ఎద్దేవా చేసారు. ఈ కామెంట్స్ పై స్పందిస్తూనే లిక్కర్ దందాలు చేసిన కవితలాంటి వారు విమర్శలను తాము పట్టించుకోబోమని జీవన్ రెడ్డి చురకలు అంటించారు. 

Latest Videos

వీడియో

తెలంగాణలో బతుకమ్మను తీరొక్క పూలతో పేరుస్తుంటారు... ఇలా మద్యలో ఆకర్షణీయమైన గుమ్మడి పూవు పెడతారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తెలిపారు. కానీ కవిత తీరు చూస్తుంటే ఇప్పుడే ఆందోళన కలిగిస్తోందని... మళ్లీ బిఆర్ఎస్ ప్రభుత్వమే వస్తే బతుకమ్మను కూడా అపవిత్రం చేస్తుందన్నారు. బతుకమ్మపై గుమ్మడి పూవు గౌరమ్మ పెట్టేబదులు విస్కీ బాటిల్ గౌరమ్మ పెడుతుందంటూ కవితపై జీవన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. 

Read More  నాపై 24 కేసులు, కేసీఆర్ అవినీతిపై ఎందుకు నోరు మెదపరు: బీజేపీ, బీఆర్ఎస్ పై రాహుల్ ఫైర్

రాహుల్ గాంధీ పై విమర్శలు చేసే అర్హత లిక్కర్ క్వీన్ ఎమ్మెల్సీ కవిత లేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ. రాహుల్ నిజామాబాద్ అభివృద్ది చూసి వెళ్లిపోవాలంటున్న కవిత అసలేం అభివృద్ది చేసారో చెప్పాలన్నారు. గతంలో  ఐదేళ్లు ఎంపి గా ఉన్న కవిత చేసిన అభివృధి ఏంటి అని ప్రశ్నించారు. బోధన్, మెట్ పల్లి చక్కెర కర్మాగారాలు మూసేయించడమే అభివృద్దా? అని ప్రశ్నించారు. 

రైతాంగం పండించే పంటలకు మద్దతు ధర ఇస్తానని ప్రకటించిన  రాహుల్ గాంధీ తమకు మార్గనిర్దేశకుడని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అన్నారు. కవిత కూడా ఇలాంటి నాలుగు మంచి పనులు చేస్తానని చెబితే బావుండేదన్నారు. కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ ఆడబిడ్డ చేయని లిక్కర్ దందా చేసిన ఆమెకు రాహుల్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు జీవన్ రెడ్డి. 
 

click me!