హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్‌పై పోలీసు కేసు.. వివరాలు ఇవే..

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ అజారుద్దీన్‌పై పోలీసు కేసు నమోదయ్యింది.

Google News Follow Us

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ అజారుద్దీన్‌పై పోలీసు కేసు నమోదయ్యింది. అజారుద్దీన్‌ నేతృత్వంలోని గత హెచ్‌సీఏ పాలకవర్గంలో అవకతవకలు జరిగాయని ఉప్పల్ స్టేడియం సీఈవో సునీల్ కాంతే  ఉప్పల్ స్టేడియంలో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అజరుద్దీన్ పాలకవర్గం సమయంలో.. జిమ్ ఎక్విప్‌మెంట్, ఫైర్ ఫైటింగ్ ఎక్విప్‌మెంట్, క్రికెట్ బాల్స్, చైర్స్ కొనుగోలులో అవకతవకలు జరిగాయని సునీల్ కాంతే తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఈ ఫిర్యాదును పరిశీలించిన ఉప్పల్ పోలీసులు.. పరికరాల కొనుగోలు కమిటీలో ఉన్న అజారుద్దీన్, మనోజ్, విజయానంద్‌లపై ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.