చెట్టును ఢీకొన్న కారు: తీవ్రంగా గాయపడిన రమేష్ రాథోడ్, ఆస్పత్రికి తరలింపు

Published : Apr 09, 2019, 10:43 PM ISTUpdated : Apr 09, 2019, 10:54 PM IST
చెట్టును ఢీకొన్న కారు: తీవ్రంగా గాయపడిన రమేష్ రాథోడ్, ఆస్పత్రికి తరలింపు

సారాంశం

ప్రమాదంలో రమేశ్ రాథోడ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఆయనను రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆస్పత్రి వద్దకు భారీగా చేరుకున్నారు.

ఆదిలాబాద్: కారు ప్రమాదంలో కాంగ్రెసు ఆదిలాబాద్ లోకసభ అభ్యర్థి రమేష్ రాథోడ్ తీవ్రంగా గాయపడ్డారు.  ఆయన ప్రయాణిస్తున్న కారు మావల బైపాస్ వద్ద చెట్టును ఢీకొట్టింది. 

ఈ ప్రమాదంలో రమేశ్ రాథోడ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఆయనను రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆస్పత్రి వద్దకు భారీగా చేరుకున్నారు. రమేశ్ రాథోడ్‌కు వైద్యులు చికిత్స కొనసాగిస్తున్నారు. 

ఎదురుపడిన జంతువులను తప్పించబోవడంతో కారు అదుపు తప్పి చెట్టును ఢీకొన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో రమేష్ రాథోడ్ తో పాటు మరో ముగ్గురు ఉన్నారు. కారు డ్రైవర్, రమేష్ రాథోడ్ గన్ మన్ కూడా గాయపడ్డారు.

PREV
click me!

Recommended Stories

ప‌దో త‌ర‌గతి ప‌రీక్ష ఫీజుల షెడ్యూల్ విడుద‌ల‌.. ఎప్ప‌టి నుంచి ప్రారంభం? చివ‌రి తేదీ ఎప్పుడు.?
ఎల్ నినో ఎఫెక్ట్ ఎంతున్నా.. హైదరాబాద్ లో నో వాటర్ ప్రాబ్లమ్ : సీఎం రేవంత్ రెడ్డి